STOCKS

News


మార్కెట్లోకి సరికొత్త బాలెనో

Tuesday 29th January 2019
news_main1548734461.png-23860

- అత్యాధునిక ఫీచర్లతో కొత్త వేరియంట్‌
 ధర రూ.5.4 లక్షల నుంచి రూ.8.77 లక్షలు

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ బాలెనో మోడల్‌లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్‌ ధరలు రూ.5.4 లక్షల నుంచి రూ.8.77 లక్షల రేంజ్‌లో ఉంటాయని మారుతీ తెలిపింది. కొత్త బాలెనోలో రియర్‌ పార్కింగ్‌ కెమెరాతో కలసి ఉన్న కొత్త ఇన్ఫోటైన్మెంట్‌ సిస్టమ్‌, టూ టోన్‌ 16 అంగుళాల అలాయ్‌ వీల్స్‌, కారు డ్రైవింగ్‌ మరింత సౌకర్యవంతంగా ఉండేలా నావిగేషన్‌ విత్‌ లైవ్‌ ట్రాఫిక్‌, వెహికల్‌ ఇన్ఫర్మేషన్‌, స్క్రీన్‌పై ఎప్పటికప్పుడు అలర్ట్స్‌ అందటం వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) ఆర్‌.ఎస్‌.కల్సి చెప్పారు. డ్యుయల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, ఈబీడీతో కూడిన యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, బ్రేక్‌ అసిస్ట్‌, ఐసోఫిక్స్‌ చైల్డ్‌ రిస్ట్రెయింట్‌ సిస్టమ్‌, స్పీడ్‌ అలర్ట్‌ సిస్టమ్‌ వంటి భద్రత ఫీచర్లు ఉన్నాయని వివరించారు.
38 నెలల్లోనే 5 లక్షల అమ్మకాలు
బాలెనో కొత్త వేరియంట్‌ 1.2 లీటర్‌ పెట్రోల్‌, 1.3 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లలో లభ్యమవుతుందని కల్సి  పేర్కొన్నారు. పెట్రోల్‌ వేరియంట్‌ (మాన్యువల్‌ ట్రాన్సిమిషన్‌) ధరలు రూ.5.4 లక్షల నుంచి రూ.7.45 లక్షల రేంజ్‌లో, ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్‌ ధరలు రూ.7.48 లక్షల నుంచి రూ.8.77 లక్షల రేంజ్‌లో ఉన్నాయని తెలిపారు. అలాగే డీజిల్‌ వేరియంట్‌లో మాన్యువల్‌ ట్రాన్సిమిషన్‌ మోడల్‌ మాత్రమే లభిస్తుందని, దీని ధరలు రూ.6.6 లక్షల నుంచి రూ.8.6 లక్షల రేంజ్‌లో ఉన్నాయని వివరించారు. బాలెనో మోడల్‌ మైలేజీ ఒక్కో లీటర్‌కు పెట్రోల్‌ వేరియంట్‌కు 21.4 కి.మీ. డీజిల్‌ వేరియంట్‌ 27.4 కి.మీ. వస్తుందని అంచనా. ఇటీవలనే ఈ కారు 5 లక్షల అమ్మకాలు మైలురాయిని చేరుకుందని, 38 నెలల్లోనే ఈ ఘనత సాధించామని కల్సి తెలిపారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ కొత్త వేరియంట్లలో మార్పులు చేశామని, ఈ కొత్త వేరియంట్‌ మారుతీ బాలెనో బ్రాండ్‌ను మరింతగా పెంపొందిస్తుందని పేర్కొన్నారు. పోటీ తీవ్రంగా ఉండే ప్రీమియమ్‌ హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్లో బాలెనో మంచి విజయం సాధించిందన్నారు. ఈ మోడల్‌ హ్యుందాయ్‌ ఇలీట్‌ ఐ20, ఫోక్స్‌వ్యాగన్‌ పోలో కార్లకు గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.



You may be interested

గెలాక్సీ ‘‘ఎమ్‌’’ స్మార్ట్‌ఫోన్లు

Tuesday 29th January 2019

గెలాక్సీ ఎమ్‌20 ధరలు రూ.10,990-12,990 గెలాక్సీ​ ఎమ్‌10 ధరలు రూ.7,990-8,990 న్యూఢిల్లీ: శామ్‌సంగ్‌ ఇండియా కంపెనీ గెలాక్సీ ఎమ్‌20, ఎమ్‌10 స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో అందుబాటులోకి తెస్తోంది.  షావోమి బడ్జెట్‌ ఫోన్‌, రెడ్‌మీకి పోటీగా ఈ ఫోన్లను శామ్‌సంగ్‌ మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్లను  అమెజాన్‌లో వచ్చే నెల 5 నుంచి కొనుగోలు చేయవచ్చని శామ్‌సంగ్‌ ఇండియా తెలిపింది. గెలాక్సీ ఎమ్‌20లో 3జీబీ, 32 జీబీ వేరియంట్‌ ధర రూ.10,990 అని, 4జీబీ, 64

నష్టాలతో ప్రారంభం

Tuesday 29th January 2019

సెన్సెక్స్‌ 75 పాయింట్లు, నిఫ్టీ 25 పాయింట్లు డౌన్‌   అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ మంగళవారం భారత్‌ సూచీలు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రారంభ సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 75 పాయింట్లు క్షీణించి 35,580 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 10,635 పాయింట్ల వద్ద కదులుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, బజాజ్‌ ఆటో, గెయిల్‌, యూపీఎల్‌, బీపీసీఎల్‌లు 1-2.5 శాతం మధ్య నష్టంతో ట్రేడవుతుండగా, అల్రా‍్టటెక్‌ సిమెంట్‌, బజాజ్‌

Most from this category