STOCKS

News


జెనీవా ఆటోషోలో ఎలక్ట్రిక్‌ కార్ల సందడి

Wednesday 6th March 2019
news_main1551852168.png-24450

  • ఎలక్ట్రిక్ హైపర్‌ కార్ బటిస్టా 

జెనీవా: ఇక్కడ జరుగుతున్న 89వ జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో భారత కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు సందడి చేస్తున్నాయి. మహీంద్రా గ్రూప్‌ తన ఎలక్ట్రిక్ హైపర్‌ కార్ బటిస్టాను ఆటోషోలో మంగళవారం ఆవిష్కరించింది. కేవలం రెండు సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈకారు గరిష్టంగా 350 కి.మీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఫార్మలా రేస్‌ వన్‌ కారు కంటే వేగమైన ఈకారు ఉత్పత్తి ప్రస్తుతం పరిమితంగా 150 మాత్రమే ఉండనుందని తెలిపింది. 2020లో ఈ కారు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్‌ అనంద్‌ మహీంద్ర మాట్లాడుతూ.. ‘ఫేమ్‌ 2 స్కీమ్‌ను మేం ఆహ్వానిస్తున్నాం. ఈ స్కీంలో సబ్సిడీ ఉన్నందున తక్కువ ధరలకే ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉంటాయి. ఇక జెన్‌జీ ఈ స్కూటర్‌ భారత మార్కెట్లో అధిక ధరతో ఉంది. అమెరికాకు ఎగుమతుల్లో భాగంగా ఈ స్కూటర్‌ ఉత్పత్తి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. 



You may be interested

ఫిబ్రవరిలో సేవలు బాగున్నాయ్‌: నికాయ్‌

Wednesday 6th March 2019

న్యూఢిల్లీ: భారత్‌ సేవల రంగం ఫిబ్రవరిలో చక్కటి పనితనాన్ని ప్రదర్శించింది. నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ ప్రకారం- సూచీ ఫిబ్రవరిలో  52.5గా నమోదయ్యింది. జనవరిలో ఈ సూచీ 52.3గా ఉంది. కొత్త ఆర్డర్లు బాగుండడం, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డం సూచీ తాజా క్రియాశీలతకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే నికాయ్‌ సూచీ విశ్లేషణను చూస్తే,... 50 పైన పాయింట్లు వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ దిగువన

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ మాజీ డైరెక్టర్లపై మనీలాండరింగ్‌ ఆరోపణలు

Wednesday 6th March 2019

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ను చక్కదిద్దేందుకు ఏర్పాటైన కొత్త బోర్డు .. తాజాగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఫిన్‌)కి చెందిన 14 మంది మాజీ డైరెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్‌కు సహకరించారని, నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేయడం ద్వారా కంపెనీకి తీవ్ర నష్టాలు తెచ్చిపెట్టారని ఫిబ్రవరి 27న జారీ చేసిన నోటీసుల్లో ఆరోపించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, కుట్ర, అనుచిత

Most from this category