STOCKS

News


ఎర్నింగ్స్‌ సీజన్‌ ఎలా ఉండొచ్చు?!

Wednesday 10th October 2018
news_main1539162894.png-21020

రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అంచనాలు
క్యు2లో ఐటీ, కన్జూమర్‌గూడ్స్‌ రంగాల కంపెనీలు బలమైన ఎర్నింగ్స్‌ నమోదు చేస్తాయని, ఆటో, ఫార్మా, సిమెంట్‌ రంగాల కంపెనీలు ఒత్తిళ్లను ఎదుర్కొంటాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. విద్యుత్‌ రంగ కంపెనీల ఫలితాలు ఫ్లాట్‌గా ఉండొచ్చని తెలిపింది. నిర్మాణ రంగంలో కంపెనీల ఆదాయాలు పెరిగినా ఎర్నింగ్స్‌ మందకొడిగానే ఉండొచ్చని తెలిపింది.
వివిధ రంగాలపై బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయాలు..
ఐటీ, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ గూడ్స్‌: రూపాయి క్షీణత ఐటీ కంపెనీలకు కలిసిరావచ్చు. ఐటీ లార్జ్‌ క్యాప్స్‌ రెవెన్యూ డాలర్‌ లెక్కల్లో 1.5 శాతం చొప్పున వృద్ధి నమోదు చేయవచ్చు. మిడ్‌క్యాప్‌ ఐటీ షేర్లలో సైయంట్‌ మంచి ఫలితాలు ప్రకటించవచ్చు. కన్జూమర్‌ గూడ్స్‌ రంగంలో కంపెనీలు సరాసరిన 13 శాతం ఎర్నింగ్స్‌ వృద్ధి చూపుతాయని అంచనా. కీలక కంపెనీలు: టీసీఎస్‌, సైయంట్‌, సొనాటా, టైటాన్‌, జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌, హెచ్‌యూఎల్‌.
బీఎఫ్‌ఎస్‌ఐ: ఈ రంగంలో కంపెనీల పనితారుపై ఆస్తుల నాణ్యత ఒత్తిళ్లు ఉంటాయి. లిక్విడిటీ తరుగుదల ఈ రంగాన్ని కలవరపెడుతోంది. ఈ దఫా ఫలితాలు పేలవంగా ఉంటాయని అంచనా, ఎన్‌ఐఎంలో 11 శాతం వృద్ధి ఉండొచ్చు. కీలక కంపెనీలు: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, డీసీబీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌.
ఫార్మా, సిమెంట్‌: యూఎస్‌ వ్యాపారంలో మందగమనం కారణంగా కంపెనీల ఫలితాలు అంతంతమాత్రంగా ఉంటాయి. అయితే గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. సిమెంట్‌ రంగంలో ఈ దఫా ఆరోగ్యవంతమైన వృద్ది ఉంటుంది. అయితే ఉత్పాదకాల వ్యయాలు పెరగడం ఎబిటాపై నెగిటివ్‌ ప్రభావం చూపవచ్చు. కీలక కంపెనీలు: సన్‌ఫార్మా, ఏసీసీ, హెడిల్‌బర్గ్‌.
ఆటో: పెద్ద కంపెనీల్లో మార్జిన్ల ఒత్తిళ్లు కనిపిస్తున్నాయి. లాభాల్లో భారీ క్షీణత ఉండొచ్చు. కీలక కంపెనీలు: బజాజ్‌ ఆటో, ఎస్కార్ట్స్‌.
నిర్మాణం, విద్యుత్‌ ఉపకరాలు: ఈ రెండు రంగాల్లో రెవెన్యూ వృద్దిఉన్నా, ఫలితాలు ఫ్లాట్‌గా ఉంటాయి. వడ్డీ వ్యయాలు పెరగడం ఈ రంగాలపై నెగిటివ్‌ ప్రభావం చూపనుంది. కీలక కంపెనీలు: ఎన్‌సీసీ, హెచ్‌జీఐ, కేఈసీ, కల్పతరు పవర్‌, పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్, ఈఐఎల్‌, ఎన్‌టీపీసీ. 



You may be interested

కుప్పకూలనున్న క్రిప్టోకరెన్సీ?!

Wednesday 10th October 2018

అనలిస్టుల హెచ్చరిక క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ కుప్పకూలే సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని ఎకనమిస్టులు, జునిపెర్‌ రిసెర్చ్‌ తదితర సంస్థలు హెచ్చరిస్తున్నాయి. క్రిప్టోల్లో దిగ్గజంగా చెప్పుకునే బిట్‌ కాయిన్‌ డైలీ లావాదేవీ వాల్యూంలు(డీటీవీ) ఏడాది సరాసరి కన్నా కనిష్ఠాలకు పడిపోవడం ప్రమాదఘంటికని చెబుతున్నారు. 2017లో బిట్‌కాయిన్‌ సరాసరి డీటీవీలు 3.6 లక్షలుండగా, 2018 సెప్టెంబర్‌నాటికి 2.3 లక్షలకు పడిపోయాయి. అదే విధంగా డైలీ లావాదేవీ విలువ గతేడాది 370 కోట్ల డాలర్లుండగా, ఈ ఏడాది

బంధన్‌ బ్యాంక్‌ లాభం 47 శాతం జంప్‌

Wednesday 10th October 2018

ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (జూలై-సెప్టెంబర్‌, క్యూ2) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే బ్యాంక్‌ నికర లాభం 47.4 శాతం వృద్ధితో రూ.488 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ.331 కోట్లుగా నమోదయ్యింది. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 55.6 శాతం వృద్ధితో రూ.1,078 కోట్లకు ఎగసింది. స్థూల ఎన్‌పీఏలు

Most from this category