STOCKS

News


ప్రత్యక్ష పన్ను వసూళ్ల వృద్ధి రేటు 14 శాతం

Tuesday 8th January 2019
Markets_main1546943613.png-23471

- ఏప్రిల్-డిసెంబర్‌ మధ్య రూ.8.74 లక్షల కోట్లు


న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2018 ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య (2017 ఇదే కాలంతో పోల్చి) స్థూలంగా 14.1 శాతం పెరిగాయి. విలువలో ఇది రూ.8.74 లక్షల కోట్లు. ఆర్థికశాఖ సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే...
- 2018 ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య రిఫండ్స్‌ విలువ రూ.1.30 లక్షల కోట్లు. 2017 ఇదే కాలంతో పోల్చిచూస్తే, ఇది 17 శాతం అధికం. రిఫండ్స్‌ తరువాత, నికర వసూళ్లు 13.6 శాతం వృద్ధితో రూ.7.43 లక్షల కోట్లుగా ఉన్నాయి. 
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం రూ.11.50 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఇప్పటికి జరిగిన వసూళ్లు ఇందులో 64.7 శాతానికి సమానం. 
- ముందస్తు వసూళ్లు 14.5 శాతం వృద్ధితో రూ.3.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 
- కార్పొరేట్‌ పన్ను వసూళ్లు స్థూలంగా 14.8 శాతం పెరిగాయి. వ్యక్తిగత ఆదాయ వసూళ్లలో 17.2 శాతం వృద్ధి నమోదయ్యింది. రిఫండ్స్‌ తరువాత ఈ వృద్ధి రేట్లు వరుసగా 16 శాతం, 14.8 శాతంగా ఉన్నాయి. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 80 పాయింట్లు జంప్‌

Wednesday 9th January 2019

అమెరికా, చైనాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు ఫలప్రదంగా ముగుస్తాయన్న అంచనాలతో సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 70 పాయింట్ల పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీతో అనుసంధామై ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ బుధవారం ఉదయం గం.8:50ని. లకు 10,918 వద్ద కదులుతుంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ స్పాట్‌తో పోలిస్తే 48 పాయింట్ల ప్రీమియంతో 10,848 పాయింట్ల వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు సైతం పాజిటివ్‌ ట్రేడ్‌ అవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌

40వేల కోట్ల పెట్టుబడులు!!

Tuesday 8th January 2019

- ఓఏఎల్‌పీ రెండో రౌండు వేలంపై అంచనా - 14 బ్లాక్‌ల వేలం ప్రక్రియ ప్రారంభం - మార్చి 12లోగా బిడ్ల దాఖలు న్యూఢిల్లీ: ఓపెన్ ఏకరేజ్‌ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద తలపెట్టిన రెండో విడత చమురు, గ్యాస్ బ్లాక్‌ల వేలం ద్వారా రూ. 40,000 కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా వేస్తున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. గతేడాది నిర్వహించిన తొలి విడతలో 55 బ్లాక్‌లు వేలం వేయగా

Most from this category