News


ఫేమ్‌ పథకానికి రూ. 10,000 కోట్లు

Friday 1st March 2019
Markets_main1551436687.png-24391

- జాతీయ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల విధానానికి ఓకే
- ఆధార్ ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర
- వొడాఫోన్‌ ఐడియా రైట్స్ ఇష్యూకి ఆమోదం
- కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు

న్యూఢిల్లీ: సబ్సిడీలివ్వడం ద్వారా విద్యుత్, హైబ్రీడ్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన రెండో విడత ఫేమ్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనికి రూ. 10,000 కోట్లు కేటాయించింది. 2019 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం మూడేళ్ల పాటు కొనసాగుతుంది. దీని కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు కొనుగోలు సమయంలో సబ్సిడీ రూపంలో ప్రోత్సాహకం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ స్కీము కింద 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, అయిదు లక్షల త్రిచక్ర వాహనాలు, 55,000 కార్లు, 7,000 బస్సుల కొనుగోలుకు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. అలాగే, 2,700 చార్జింగ్ స్టేషన్స్‌ ఏర్పాటు కానున్నాయి. రూ. 895 కోట్ల కేటాయింపుతో 2015 ఏప్రిల్ 1న ఫేమ్ పథకం తొలి విడత అమల్లోకి వచ్చింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ ఫేమ్ పథకంతో పాటు పలు ఇతరత్రా ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపింది. 2025 నాటికి భారత్‌ను సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో.. జాతీయ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు మొబైల్ కనెక్షన్లు పొందేందుకు, బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఆధార్‌ను స్వచ్ఛందంగా సమర్పించవచ్చన్న ప్రతిపాదనకు చట్టబద్ధత కల్పించేలా ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. 

ఎస్‌పీవీకి ఎయిరిండియా రుణాలు...
ప్రభుత్వ రంగ ఎయిరిండియా డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా దానితో పాటు నాలుగు అనుబంధ సంస్థలకు చెందిన రు. 29,464 కోట్ల రుణాలను బదలాయించేందుకు ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్‌ పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఏర్పాటైన ఎస్‌పీవీకి ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్‌, ఎయిర్‌లైన్ అలైడ్ సర్వీసెస్, ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌, హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలను బదలాయించారు. అలాగే ఎయిరిండియా ప్రాధాన్యేతర ఆస్తులు, పెయింటింగ్స్‌ మొదలైనవి కూడా ఎస్‌పీవీకి బదలాయిస్తారు. అటు టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా రైట్స్ ఇష్యూ ప్రతిపాదనకు ఓకే చేసింది. వొడాఫోన్ ఐడియా దీని కింద రూ. 5,000 కోట్ల నుంచి రూ. 25,000 కోట్ల దాకా సమీకరించాలని యోచిస్తోందని అరుణ్ జైట్లీ చెప్పారు. శతృదేశాల పౌరుల ఆస్తులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రాధాన్యేతర అసెట్స్ విక్రయ ప్రక్రియ కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

మరిన్ని నిర్ణయాలు..
- రూ. 1,450 కోట్లతో నేషనల్ హౌసింగ్‌ బ్యాంక్‌లో ఆర్‌బీఐకి ఉన్న 100 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 
- జాతీయ ఖనిజ విధానానికి ఆమోదం.
- స్పెషల్ ఎకనమిక్ జోన్లలో ఇకపై ట్రస్టులు కూడా యూనిట్స్ ఏర్పాటు చేసేందుకు అనుమతించేలా సెజ్‌ చట్ట సవరణల ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర.You may be interested

పీఎన్‌బీ.. సంస్కరణల అమల్లో టాప్‌

Friday 1st March 2019

- రెండో స్థానంలో బీవోబీ, ఎస్‌బీఐకి మూడో ప్లేస్‌ - బీసీజీ-ఐబీఏ నివేదిక - ర్యాంకులతో 'బ్యాంకింగ్' మెరుగుపడుతుందన్న ఆర్థిక మంత్రి జైట్లీ న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణంతో భారీగా నష్టపోయిన ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌, చాలా వేగంగా కోలుకుని సంస్కరణల అజెండా అమల్లో అగ్రస్థానంలో నిల్చింది. ఈ విషయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రెండో స్థానం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. సేవల నాణ్యతను

మౌలిక రంగం నిరాశ

Friday 1st March 2019

- జనవరిలో కేవలం 1.8 శాతం వృద్ధి  -  19 నెలల కనిష్ట స్థాయి న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్‌ జనవరి వృద్ధి ధోరణి నిరాశ కలిగించింది. వృద్ధి రేటు కేవలం 1.8 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జనవరితో (6.2 శాతం వృద్ధి) పోల్చిచూస్తే, 2019 జనవరిలో ఎనిమిది పరిశ్రమల బాస్కెట్‌  వృద్ధి కేవలం 1.8 శాతంగా నమోదయ్యిందన్నమాట. గడచిన 19 నెలల్లో (2017 జూన్‌లో కేవలం 1 శాతం)

Most from this category