STOCKS

News


అటకెక్కిన అరామ్‌కో ఐపీఓ

Tuesday 28th August 2018
news_main1535434913.png-19719

పబ్లిక్‌ ఆఫర్‌కు సౌదీ రాజు విముఖత
సౌదీ అరేబియాకు చెందిన అతిపెద్ద ఆయిల్‌ కంపెనీ ఆరామ్‌కో ఐపీఓ ప్లాన్లు పురిటిలోనే సంధికొట్టి ముగిశాయి. రెండేళ్లుగా అరామ్‌కోలో 5 శాత వాటాను పబ్లిక్‌ ఆఫర్‌కు తెద్దామని యువరాజు చేస్తున్న యత్నాలు ఒక కొలిక్కి రాకముందే రాజు జోక్యం చేసుకొని మొత్తం ప్రతిపాదనకే మంగళం పలికారు. దేశీయ ఎకానమీకి కొత్త ఉత్తేజాన్నిచ్చే ప్రణాళికల్లో భాగంగా ఈ పదివేల కోట్ల డాలర్ల ఐపీఓ ప్రతిపాదనను ప్రిన్స్‌ ఎంబీఎస్‌(మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌) తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించి ముమ్మర కసరత్తు కూడా జరిగింది. అయితే అంతిమ దశలో ఈ విషయమై రాజు కింగ్‌ సల్మాన్‌ కుటుంబ సభ్యులు, చమురు అధికారులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. రమ్‌జాన్‌ సందర్భంగా ఈ చర్చలు ఆరంభమై జూన్‌లో ముగిశాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీఓతో అనుకోని చిక్కులు వస్తాయని రాజు సలహాదారులు గట్టిగా నూరిపోసినట్లు తెలిసింది. ఐపీఓ దేశానికి ఉపయోగం సంగతి పక్కనపెడితే కంపెనీకి సంబంధించిన అన్ని ఆర్థిక వివరాలు పబ్లిక్‌గా వెల్లడించాల్సివస్తుందని వీరు రాజుకు చెప్పారు. ఈ ఒక్క అంశం రాజుకు కలవరం కలిగించిందని తెలిసింది. దీంతో ఈ ప్రతిపాదనను ఆపేయమని రాజు ఆదేశించారు. సౌదీలో రాజు మాట శిలాశాసనం. ఆయన ఒక్కసారి ఒద్దంటే ఇక ఆ ప్రతిపాదన ఎలాంటి పరిస్థితుల్లో కార్యరూపం దాల్చడం జరగదు. ఇదే విషయాన్ని సౌదీ ఎనర్జీమినిస్టర్‌ వెల్లడిస్తూ అరామ్‌కో ఐపీఓ భవిష్యత్‌లో ఎప్పుడో ఉంటుందని, ఇప్పటికైతే ప్రతిపాదన ఆపేశామని చెప్పారు. You may be interested

మార్కెట్లో ముందే దివాళీ!

Tuesday 28th August 2018

ఇండియా ఇన్ఫోలైన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ ఈక్విటీల్లో ఇన్వెస్టర్ల దూకుడుతో మార్కెట్లలో ముందే పండుగల సీజన్‌ వచ్చేసిందని ఇండియా ఇన్ఫోలైన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ వ్యాఖ్యానించారు. వచ్చే దీపావళిలోపే నిఫ్టీ 12,000 పాయింట్ల మైలురాయిని తాకే ఛాన్సులు ప్రస్ఫుటంగా ఉన్నాయన్నారు. అతిత్వరలో బ్యాంకు నిఫ్టీ 30వేల పాయింట్ల మైలురాయిని చేరుతుందని అంచనా వేశారు. ఇప్పటివరకు ఆర్‌ఐఎల్‌, ఐసీఐసీఐ, యాక్సిస్‌బ్యాంక్‌ మార్కెట్లను నడిపించాయని, ఇకపై సన్‌ఫార్మా, ఐటీసీ, ఎల్‌ అండ్‌ టీ షేర్లు

ఇక.. ల్యాంకో ఆస్తుల అమ్మకం

Tuesday 28th August 2018

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు చెందిన మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ల్యాంకో ఇన్‌ఫ్రా... మూసివేతకు రంగం సిద్ధమైంది. నిండా అప్పుల్లో కూరుకుపోయి... పలు బ్యాంకులకు కనీసం వడ్డీ కూడా చెల్లించే పరిస్థితి లేకపోవటంతో  ల్యాంకో ఇన్‌ఫ్రా ఆస్తులన్నిటినీ ఆమ్మి అప్పులు తీర్చే ప్రక్రియకు (లిక్విడేషన్‌) హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతినిచ్చింది. ఈ మేరకు ట్రిబ్యునల్‌ సభ్యుడు రాతకొండ మురళి సోమవారం

Most from this category