STOCKS

News


నాలుగో రోజూ నష్టాలే..!

Tuesday 12th February 2019
Markets_main1549967305.png-24161

  • 10850 దిగువకు నిఫ్టీ
  • 241 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

కీలక గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కారణంగా మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన అమ్మకాలతో మార్కెట్‌ మంగళవారం  నష్టాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఐటీ షేర్ల పతనంతో సూచీలు వరుసగా నాలుగోరోజూ నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 10850 స్థాయిని కోల్పోయి 57పాయింట్లను నష్టంతో 10,831.40 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 241 పాయింట్లు పతనమై 36,153.62 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ఈ నాలుగు రోజుల పతనంలో భాగంగా 820 పాయింట్లను నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 217 పాయింట్లు నష్టపోయి 27,011 వద్ద ముగిసింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. నేడు వినిమయ ధర ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాల విడుదల, వివిధ కంపెనీల క్యూ3 ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమతత్త కారణంగా సూచీలు మిడ్‌సెషన్‌ వరకు ఫ్లాట్‌గానే ట్రేడయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో డాలర్‌ మారకంలో రూపాయి ర్యాలీ కారణంగా ఐటీ షేర్ల భారీ నష్టపోయాయి. మరోవైపు మెటల్‌ షేర్ల ర్యాలీ సూచీలకు అండగా నిలిచింది. అయితే  మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన అ‍మ్మకాలు సూచీల తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్ల నష్టాల ట్రేడింగ్‌ సూచీల భారీ పతనానికి కారణమైంది. బ్యాంకింగ్‌ షేర్లు ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టే్‌ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ 2.50శాతం, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ 1.50శాతం చొప్పున నష్టపోయాయి.  అధిక వెయిటేజీ కలిగిన ఈ షేర్ల క్షీణతతో నిఫ్టీ 66 పాయింట్లను కోల్పోయి 10,823 వద్ద, సెన్సెక్స్‌ 281 పాయింట్లను నష్టపోయి 36,114 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు పతనమయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 36,153.62 వద్ద, నిఫ్టీ 10,831 వద్ద ముగిశాయి.
ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, హీరోమోటర్స్‌కార్ప్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 1.75శాతం నుంచి 3.50శాతం నష్టపోగా, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 2శాతం నుంచి 4శాతం లాభపడ్డాయి.



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 33 పాయింట్లు అప్‌

Wednesday 13th February 2019

అమెరికా ప్రభుత్వ షట్‌డవున్‌కు తెరపడుతుందన్న వార్తలు, అమెరికా, చైనా వాణిజ్య చర్చల సఫలంపై ఆశావహ అంచనాలతో గత రాత్రి అమెరికా, యూరప్‌ సూచీల పెరగడానికి తోడు, తాజాగా ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో బుధవారం ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 33 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.50  గంటలకు 10,893పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,860 పాయింట్ల వద్ద

ప్లెడ్జ్‌ షేర్లతో భయపెడుతున్న బేర్స్‌

Tuesday 12th February 2019

మార్కెట్లు భయాందోళనలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లను మరింత భయపెట్టేందుకు కొన్ని కధలు ప్రచారమవుతాయని, ప్రస్తుతం ప్లెడ్జ్‌షేర్లపై వస్తున్న కధనాలతో బేర్‌ ఆపరేటర్లు పనిగడుపుకుంటున్నారని ప్రముఖ అనలిస్టులు చెబుతున్నారు. ఇప్పట్లో కొనుగోళ్ల మద్దతు లభించని కంపెనీల గురించి పూర్తిగా తెలుసుకొని వాటి షేర్లపై దాడి చేస్తున్నారన్నారు. ఒకపక్క ఆ షేరుపై దాడి చేయడం, మరోపక్క ప్లెడ్జ్‌ షేర్లపై కధనాలు ప్రచారంలో ఉంచడం ద్వారా షార్ట్‌ పొజిషన్లు, పుట్‌ పొజిషన్లలో భారీ లాభాలు సంపాదిస్తున్నారని

Most from this category