STOCKS

News


జిర్కాన్‌ టెక్నాలజీస్‌ ఐపీఓకు సెబీ ఓకే !

Wednesday 21st November 2018
Markets_main1542775460.png-22242

న్యూఢిల్లీ: జిర్కాన్‌ టెక్నాలజీస్‌ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. వస్తువుల ప్యాకేజింగ్‌కు సంబంధించిన లేబుల్‌ ప్రింటింగ్‌ వ్యాపారాన్ని ఈ కం‍పెనీ నిర్వహిస్తోంది. ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ 59 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, డెహ్రాడూన్‌లో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు తీర్చుకోవడానికి, ఇతర సాధారణ వ్యాపార అవసరాలకు వినియోగించుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్‌గా సిస్టమాటిక్స్‌ కార్పొరేట్‌ సర్వీసెస్‌ వ్యవహరిస్తోంది. కాగా,  ఈ ఐపీఓ ఆమోదంతో కలుపుకొని సెబీ ఈ ఏడాది ఇప్పటిదాకా 70 కంపెనీల ఐపీఓలకు పచ్చజెండా ఊపింది.



You may be interested

టాలెంట్‌లో తగ్గిన భారత్‌

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కి చెందిన ఐఎండీ బిజినెస్ స్కూల్‌ వార్షిక టాలెంట్ ర్యాంకింగ్‌లో ఈసారి భారత్ రెండు స్థానాలు దిగజారి 53వ స్థానానికి పరిమితమైంది. అయిదోసారి కూడా స్విట్జర్లాండ్ అగ్రస్థానం దక్కించుకుంది. 63 దేశాలతో ఐఎండీ బిజినెస్ స్కూల్ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ జాబితాలో టాప్‌-5 స్థానాల్లో స్విట్జర్లాండ్‌ వెనుకన డెన్మార్క్‌, నార్వే, ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. ఆసియా దేశాల్లో మాత్రం సింగపూర్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గ్లోబల్‌ లిస్టులో మాత్రం

షావోమీ గిన్నిస్ రికార్డు

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమీ ఒకే రోజున 500 రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. భారత గ్రామీణ ప్రాంతాల్లో 'మి స్టోర్స్స్‌’ పేరిట అక్టోబర్ 29న వీటిని ప్రారంభించామని షావోమీ గ్లోబల్ వైస్‌ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ తెలిపారు. ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఉన్న పెద్ద స్థాయి "మి హోమ్‌" స్టోర్స్‌ తరహాలోనే ఇవి కూడా ఉంటాయని తెలియజేశారు. 2019 ఆఖరు నాటికి

Most from this category