STOCKS

News


లాభాల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌

Thursday 11th July 2019
Markets_main1562840545.png-26992

 సానుకూలంగా దేశియ మార్కెట్లు ట్రేడవుతుండడంతో పాటు కంపెనీ వ్యూహాత్మక పెట్టుబడులు పెరిగే అవకాశం ఉండడంతో జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు విలువ గురువారం 7.14 శాతం లేదా రూ. 23.75 లాభపడి రూ. 356.50 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ.332.75 వద్ద ముగిసింది. జీ ఎంటర్‌ప్రైజెస్‌ కోసం బిడ్‌ దాఖలుచేయడానికి కామ్‌కాస్ట్‌ నాయకత్వంలోని కన్సార్టియం ప్రయత్నిస్తుండడం తెలిసిందే. ఈ కన్సార్టియంలో కామ్‌కాస్ట్‌తో పాటు ప్రైవేట్‌ ఈక్వీటీ సంస్థ బ్లాక్‌ స్టోన్‌, జేమ్స్‌ ముర్డోక్స్‌ లుపా సిస్టమ్స్‌ ఉన్నాయి. వీటితో పాటు కామ్‌కాస్ట్‌ మాజీ సీఎఫ్‌ఓ మైకెల్‌ ఏంజిల్‌కిస్‌ సంస్థైనా అటైరోస్‌ కూడా కన్సార్టియంలో ఉంది. ఫేస్‌బుక్‌ కూడా ఆసక్తి చూపడంతో జీ ఎంటర్‌‍ప్రైజెస్‌లోని స్టాకులను కొనుగోలు చేయడానికి కామ్‌కాస్ట్‌, బ్లాక్‌ స్టోన్‌, ఫేస్‌బుక్‌, అటైరోస్‌ కంపెనీలు ప్రతిస్పందించినట్టవుతుంది. వాల్ట్‌ డిస్నీతో ఒప్పందం కారణంగా లూపా సిస్టమ్స్‌ 9-10 శాతం కం‍టే ఎక్కువ వాటాను కొనుగోలు చేయడానికి వీలులేదు. 2018 నవంబర్‌లో జీ ప్రమోటర్లు వారి వాటాను అమ్ముకోడానికి వ్యూహాత్మకమైన భాగస్వామిని వెతుకుతున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే.


zee

You may be interested

నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్‌

Thursday 11th July 2019

226 పాయింట్లు పెరిగి సెన్సెక్స్‌  రాణించిన అటో, మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు  వరుస 4రోజుల మార్కెట్‌ నష్టాలకు గురువారం బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 266 పాయింట్లు లాభంతో 38,823.11 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 84.00 పాయింట్లు ర్యాలీ చేసి 11,582.90 వద్ద ముగిసింది. మార్కెట్‌ 4రోజుల భారీ పతనం నేపథ్యంలో నేడు ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు పూనుకోవడంతో పాటు ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ కీలక వడ్డీరేట్ల తగ్గింపు సంకేతాలనివ్వడం, ఫారెక్స్‌ మార్కెట్లో

ఆనంద్‌రాఠీ నుంచి మూడు సిఫార్సులు

Thursday 11th July 2019

ప్రస్తుత పతనంలో క్రమానుగత ధోరణిలో కొనుగోలు చేసి అట్టిపెట్టుకోవాల్సిన మూడు షేర్లను ఆనంద్‌ రాఠీ బ్రోకరేజ్‌ సంస్థ రికమండ్‌ చేసింది. 1. సిటీయూనియన్‌బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 228. స్థిరమైన ఆస్తుల నాణ్యత, బలమైన క్యాపిటలైజేషన్‌, రిటైల్‌, ఎస్‌ఎంఈ రంగాలపై ఎక్కువ ఫోకస్‌... అనే లక్షణాలు బ్యాంకును ముందుకు నడిపిస్తాయి. వీటి కారణంగా మిడ్‌టర్మ్‌లో బ్యాంకు లాభాలు, మార్జిన్లు బలంగా మారతాయి. గతేడాదితో పోలిస్తే లోన్‌బుక్‌లో 17 శాతం వృద్ది నమోదయింది.

Most from this category