STOCKS

News


జీ ఎంటర్‌టైన్‌మైంట్‌ జోరు

Tuesday 26th February 2019
Markets_main1551173656.png-24341

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో భారీ లాభపడుతున్నాయి. నేడు బీఎస్‌ఈలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు రూ.442.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కంపెనీలో వాటా కొనుగోలు కోసం అంతర్జాతీయంగా పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వాటిలో ప్రధానంగా సోనీ, కామ్‌కాస్ట్‌, యాపిల్‌, అలీబాబా సంస్థలు ముందంజలో ఉన్నాయని సమాచారం వెల్లడైంది. ఈ వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఇంట్రాడేలో షేరు 10శాతం లాభపడి రూ.489.75ల గరిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం గం.2.45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు (రూ.445.6)తో పోలిస్తే 5శాతం లాభంతో రూ.469ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ - 50 సూచీలోని టాప్‌ -5 గెయినర్లలో మొదటి స్థానంలో ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ. 288.95 రూ.609.75లుగా ఉన్నాయి.



You may be interested

తీవ్ర హెచ్చుతగ్గులు-నష్టాలతో ముగింపు

Tuesday 26th February 2019

సరిహద్దుల్లో భారత్‌, పాకిస్థాన్‌ యుద్ధ ఉద్రిక్త నేపథ్యంలో మంగళవారం దేశీయ మార్కెట్‌ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 239 పాయింట్ల నష్టంతో 35974 వద్ద, నిఫ్టీ 45పాయింట్ల నష్టంతో 10835 వద్ద ముగిసింది. బ్యాంక్‌, ఆర్థిక, ఎఫ్‌ఎంజీసీ, రియల్టీ షేర్లు అ‍మ్మకాల ఒత్తిడికి లోనవగా, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. మరోవైపు అటో, ఫార్మా, మెటల్‌, మీడియా షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత వైమానిక దళం

కరాచీ ఇండెక్స్‌ క్రాష్‌

Tuesday 26th February 2019

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో అటు పాకిస్థాన్‌ దేశపు ఎక్చే‍్సంజ్‌లు కూడా భారీగా నష్టపోతున్నాయి. నేడు కరాచీ స్టాక్‌ ఇండెక్స్‌(కేఈసీ) 465 పాయింట్లు(1.17శాతం) నష్టపోయి 39,142.29 వద్దకు పతనమైంది. పుల్వామా ఉగ్రదాడి ప్రతీకారంలో భాగంగా భారత వాయుదళం ఎల్‌ఓసీని దాటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తం మూడు నిర్దేశిత లక్ష్యాలపై వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు గల లేజర్‌ గైడెడ్‌ బాంబులతో యుద్ధ విమానాలు

Most from this category