STOCKS

News


జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 10శాతం క్రాష్‌

Tuesday 18th December 2018
Markets_main1545123179.png-23047

టార్గెట్‌ ధర తగ్గింపుతో పాటు రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌తో మంగళవారం జీఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. నేడు బీఎస్‌ఈలో జీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు రూ.500ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్‌ఏ-ఎంఎల్) జీఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు రేటింగ్‌ను ‘‘అండర్‌ఫెర్మ్‌ఫామ్‌’’కు డౌన్‌గ్రేడింగ్‌ చేయడంతో పాటు షేరు ప్రస్తుత ధర నుంచి టార్గెట్‌ ధరను రూ.375లకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం షేరు ఎదుర్కోంటున్న ప్రమాదకర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు చాలా సమయం పడుతుంది కాబట్టి షేరు రేటింగ్‌తో పాటు, టార్గెట్‌ ధరను సైతం తగ్గిస్తున్నట్లు అమెరికా మెరిలించ్ తెలిపింది. ఈ ప్రతికూల వార్తల ప్రభావంతో నేడు షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఫలితంగా ఇంట్రాడేలో ఏకంగా 10శాతం నష్టపోయి రూ.454.40లు వద్ద కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం గం.1:45ని.కు షేరు గతముగింపు ధర(రూ.502.65)తో పోలిస్తే 8.50శాతం నష్టపోయి రూ.460.35ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి షేరు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 టాప్‌-5 లూజర్లలో 5శాతం నష్టంతో ప్రథమస్థానంలో ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.410.30 రూ.619.35లుగా నమోదయ్యాయి.



You may be interested

10941 వరకు నిఫ్టీ ర్యాలీ!

Tuesday 18th December 2018

సాంక్టమ్‌ వెల్త్‌ అంచనా దేశీయ మార్కెట్లు గత వారం లాభాల పరుగును కొనసాగిస్తున్నాయి. మంగళవారం ఆరంభంలో నష్టాలున్నా చివరకు సూచీలు లాభాల్లోకి మరలాయి. నిఫ్టీ 10900 పాయింట్ల వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 10840 పాయింట్లపైన ఉన్నంత వరకు పాజిటివ్‌గా ఉన్నట్లే భావించాలి. ఈ ఊపులో నిఫ్టీ క్రమంగా 10941 పాయింట్లను తాకేందుకు ఛాన్సులున్నాయి. ఇటీవల ర్యాలీ ఈ స్థాయిలవరకు కొనసాగింది. ఇక్కడ నిఫ్టీకి టాప్‌ ఎదురుకావచ్చు. ఈ స్థాయిని దాటితే నిఫ్టీ

పతనానికి ముందు పెట్టుబడులు?

Tuesday 18th December 2018

ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఎల్‌ఐసీ నిర్ణయాలు ఇటీవల కాలంలో భారీగా పతనమైన పలు స్టాకుల్లో సదరు పతనానికి కాస్త ముందుగా ఎల్‌ఐసీ భారీగా వాటాలు కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి చిన్న కంపెనీల్లో పెద్దగా పెట్టుబడులు పెట్టకూడదని ఎల్‌ఐసీ నిర్ణయించుకుంది. కానీ ఈ నిర్ణయానికి భిన్నంగా కొన్ని చిన్న కంపెనీల్లో వాటాలు పెంచుకోవడం, వెనువెంటనే సదరు స్టాకులు క్రాష్‌ కావడం అనుమానాలకు తావిస్తోంది. ఇలా ఎల్‌ఐసీ అనూహ్య పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో

Most from this category