STOCKS

News


జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రేటింగ్‌ జోష్‌

Tuesday 23rd April 2019
Markets_main1556005173.png-25292

విదేశీ రీసెర్చ్‌ సంస్థ మెక్వారీ ఔట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌ కేటాయింపుతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో 6శాతం ర్యాలీ చేశాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.400.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గతేడాది ప్రమోటర్‌ సుభాస్‌ చంద్ర కంపెనీలో కొంత వాటా విక్రయించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రానున్న 1-2 వారాల్లో ఈ వాటా విక్రయ అంశం ఓ కొలిక్కి వస్తుందని, వాటా కొనుగోలుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు మెక్వారీ తెలిపింది. మెక్వారీ రేటింగ్‌ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లకు గతంలో షేర్లకు కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తూ షేరు కొనుగోలు ధరను రూ.540లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఈ షేరు కౌంటర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు తెరలేపడంతో షేరు 6శాతం ర్యాలీ చేసి రూ.420.90 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:45నిల.కు షేరు గతముగింపు(రూ.396.65)తో పోలిస్తే 5శాతం లాభంతో రూ.416.55ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 288.95 రూ.609.75లుగా నమోదయ్యాయి. 



You may be interested

స్థిరంగా పసిడి

Tuesday 23rd April 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో మధ్యాహ్నం ట్రేడింగ్‌ సమయానికి 2డాలర్లు నష్టపోయి 1,275.35 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడ్‌త అవుతోంది. ఇరాన్‌ నుంచి దిగుమతయ్యే క్రూడాయిల్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయంగా మరోసారి ఉద్రిక్తతలు మొదలయ్యాయి . అలాగే క్రూడాయిలర్‌ ధరలు 6నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతుండటం కూడా పసిడి ధర స్థిరమైన ర్యాలీకి తోడ్పాటును అందిస్తున్నాయి. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీ

జెట్‌ ఎయిర్‌ షేర్లు 11శాతం జంప్‌

Tuesday 23rd April 2019

మూడురోజుల వరుసగా నష్టాల్లో ముగిసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు మంగళవారం లాభాల బాట పట్టాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.158.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణదాతలు కంపెనీకి అంతర్జాతీయంగా ఉన్న ల్యాండింగ్‌ స్లాట్‌ను, ఓవర్సీస్‌ ప్లైయింగ్‌ రైటర్స్‌ పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. . బ్యాంకులకు రూ.8,500 కోట్లు, విమానాల లీజుకిచ్చిన సంస్థలకు, ఉద్యోగులకు జెట్‌ రూ.4,000 కోట్ల

Most from this category