STOCKS

News


జీ గ్రూప్‌ షేర్ల భారీ పతనం

Friday 25th January 2019
Markets_main1548413388.png-23810

  • 31శాతం క్షీణించిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌  
  • 38శాతం పతనమైన డిష్‌ టీవీ

ఎస్సెల్‌ గ్రూప్‌నకు చెందిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, జీ మీడియా, డిష్‌ టీవీ షేర్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. వాటా కొనుగోలుకు సంబంధించి సోనీ, జీ ప్రమోటర్‌ అయిన ఎస్సెల్‌ గ్రూపుతో చర్చలు జరుపుతోందని వార్తలు తాజాగా వెలువడ్డాయి. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు సోనీ ప్రతినిధి నిరాకరించారు. అటు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రతినిధి స్పందిస్తూ ప్రస్తుతం దీనిపై ఏమీ వ్యాఖ్యానించలేమని, ఈ నేపథ్యంలో ఎలాంటి ఊహాగానాలను నమ్మొద్దని కోరారు. చర్చలు కీలక దశను పూర్తి చేసుకున్నాక అధికారిక  ప్రకటన చేస్తున్నామని కంపెనీ అధికారులు తెలిపారు. కాగా గత ఏడాది నవంబరులో అంతర్జాతీయ వ్యూహాత్మక ప్రణాళిలో భాగంగా జీలో మేజర్‌ వాటాను విక్రయించనున్నామని ఎస్సెల్‌ గ్రూపు ప్రకటించడం గమనార్హం. ఈ వార్తల నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 33.50శాతం క్షీణించి రూ.288.30 కనిష్టాన్ని చేరుకుంది. చివరకు 31శాతం(రూ.134) నష్టపోయి రూ.299.70ల వద్ద ముగిసింది.
ఇదే గ్రూప్‌నకు చెందిన డిష్‌ టీవీ 38 శాతం పతనమై రూ. 20.70 వద్ద ఇంట్రాడే కనిష్టస్థాయిని తాకింది. చివరకు 33 శాతం తగ్గుదలతో రూ. 22.50 వద్ద ముగిసింది. జీ మీడియా కార్పోరేషన్‌ సైతం 12శాతం నష్టపోయి రూ. 21.30 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరకు 11శాతం నష్టపోయి రూ.21.45 ల వద్ద ముగిసింది.



You may be interested

మైండ్‌ట్రీ ఎవరికి దక్కేను...?

Saturday 26th January 2019

మైండ్‌ ట్రీలో అతిపెద్ద నాన్‌ ప్రమోటర్‌ వీజీ సిద్ధార్థ, తన గ్రూపు కంపెనీలకు ఉన్న 21 శాతం వాటాను అమ్మే ప్రయత్నాల్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రత్యర్థి ఐటీ కంపెనీలు ఎల్‌అంటీ ఇన్ఫోటెక్‌, టెక్‌ మహీంద్రా, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు కేకేఆర్‌, ఫేర్‌ఫాక్స్‌ తదితర సంస్థలు పోటీ పడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల రిటైల్‌ ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు భంగం కలుగుతుందా...? నిపుణులు ఏమంటున్నారు...?   మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు కృష్ణకుమార్‌ నటరాజన్‌కు కంపెనీలో

మిడ్‌సెషన్‌ అ‍మ్మకాలు -నష్టాల ముగింపు

Friday 25th January 2019

10800 దిగువకు నిఫ్టీ మిడ్‌సెషన్‌ అనంతరం జరిగిన అ‍మ్మకాలు మార్కెట్‌ను ముంచేశాయి. మారుతీ సుజుకీ, జీఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్,  ఐసీఐసీఐ, అల్ట్రాటెక్‌ షేర్లలో నెలకొన్న అమ్మకాలు సూచీలు... ఈ వారంలో కనిష్టస్థాయి వద్ద ముగిసాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఈ షేర్ల క్షీణత కారణంగా నిఫ్టీ 10800 మార్కును కోల్పోయింది.  సెన్సెక్స్‌ 169.56 పాయింట్ల నష్టంతో 36, 025 వద్ద, నిఫ్టీ 69 పాయింట్ల క్షీణతతో 10,780 వద్ద స్థిరపడ్డాయి. ఐసీఐసీఐ,

Most from this category