STOCKS

News


రెండు రంగాలపై మోతీలాల్‌ఓస్వాల్‌ పాజిటివ్‌

Friday 28th December 2018
Markets_main1545994252.png-23293

కొత్త సంవత్సరం పీఎస్‌యూ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ రంగాలపై పాజిటివ్‌గా ఉన్నట్లు మోతీలాల్‌ఓస్వాల్‌ ప్రతినిధి యోగేశ్‌ మెహతా చెప్పారు. ప్రభుత్వం మరోమారు పీఎస్‌బీలకు రీక్యాప్‌ సాయం అందిస్తోందని, దీంతో లిక్విడిటీ సమస్యలు గట్టెక్కుతాయని అభిప్రాయపడ్డారు. పీఎస్‌యూ బ్యాంకుల ఆస్తుల నాణ్యత సైతం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందన్నారు. వచ్చే రెండు మూడు త్రైమాసికాల్లో ఈ మెరుగుదల మరింత పెరుగుతుందన్నారు. ప్రస్తుతం చాలా బ్యాంకుల షేర్లు వాటి బుక్‌వాల్యూ కన్నా తక్కువ వాల్యూషన్ల వద్ద డిస్కౌంట్‌కు దొరుకుతున్నాయని చెప్పారు. వీటిలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమన్నారు. మరోవైపు ఎన్‌బీఎఫ్‌సీ రంగం ఇటీవల కాలంలో బాగా పతనమైంది. ఈ రంగంలో కొన్ని షేర్లు రీబౌన్స్‌ఐనా, ఇంకా కొన్ని మంచి షేర్లు తక్కువ రేట్ల వద్దే ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్‌ ఉన్న ఎన్‌బీఎఫ్‌సీ షేర్లను ఎంచుకోవడం మంచిదని సూచించారు. 
గతేడాది మంచి పరుగులు తీసిన రంగాలను వదిలేయడంం ఉత్తమమని ఆయన సూచించారు. పైన చెప్పిన రెండు రంగాలతో పాటు సరైన వాల్యూషన్ల వద్ద ఉన్న నాణ్యమైన మిడ్‌క్యాప్స్‌ను(ఓబెరాయ్‌ రియల్టీ, పీవీఆర్‌, బ్రిటానియా) సైతం ఎంచుకోవచ్చన్నారు. ఈ సంవత్సరం ఎలాగైతే ఆద్యంతం ఒడిదుడుకులు ఉన్నాయో, వచ్చే ఏడాది కూడా ఆటుపోట్లు కొనసాగుతాయని ఆయన అంచనా వేశారు. కనీసం వచ్చే ఏడాది తొలి ఆరునెలలు సూచీల్లో ఒడిదుడుకులు తప్పవన్నారు. త్వరలో క్యూ3 సీజన్‌ ఆరంభం కాబోతోందని, క్యు2లో వచ్చిన సంకేతాలను చూస్తే మూడో త్రైమాసికంలో మంచి ఫలితాలే ఉండొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ ఎకానమీ గత కొన్ని త్రైమాసికాల నీరసాన్ని ఒదిలి చురుగ్గా కదలాడుతోందని మెహతా చెప్పారు. You may be interested

ఫండ్స్‌లో పెట్టుబడులను ఎప్పుడు తీసేసుకోవచ్చు?

Friday 28th December 2018

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడిపై కేవలం మూడు నెలల్లోనే 20 శాతం రాబడి వచ్చింది... వెంటనే బుక్‌ చేసుకోవాలా? నెల క్రితం ఇన్వెస్ట్‌ చేస్తే దానిపై నష్టాలు చూపిస్తున్నాయి... అమ్మేసేస్తే పోదూ...? సాధారణంగా మ్యూచువల్‌ పండ్స్‌ ఇన్వెస్టర్లలో ఎక్కువ మందికి ఇవే తరహా సందేహాలు ఎదురవుతుంటాయి. దీంతో ఏదో ఒక సందర్భంలో వారు తోచినట్టు నిర్ణయాలను అమలు చేస్తుంటారు. కానీ, దీర్ఘకాలంలో సంపద పోగుబడాలంటే ఈ తరహా ఆలోచనలకు దూరంగా

మూడో రోజూ లాభాల ముగింపే

Friday 28th December 2018

10850పైన నిఫ్టీ ముగింపు 36000పైన ముగిసిన సెన్సెక్స్‌ ఫార్మా, ఫైనాన్స్‌ షేర్లు ర్యాలీతో సూచీలు వరుసగా మూడోరోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల అంశాలతో సూచీలు ట్రేడింగ్‌ ఆద్యంతం స్థిరమైన ర్యాలీని చేశాయి. అయితే చివరి గంటలో అమ్మకాలు జరగడంతో సూచీల లాభాలు కొంతమేర తగ్గాయి. ప్రపంచమార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ ప్రోత్సాహంతో సూచీలు జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ను లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 105 పాయింట్ల లాభంలో 35,912 వద్ద, నిఫ్టీ 59

Most from this category