STOCKS

News


యస్‌ బ్యాంక్‌కు రేటింగ్‌ జోష్‌

Monday 19th November 2018
Markets_main1542614097.png-22184

  • 7శాతం ర్యాలీ చేసిన షేర్లు

ముంబై:- ఇక్రా రేటింగ్‌ పెంపుతో పాటు నూతన సీఈవో పదవి ఎంపిక ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో​యస్‌ బ్యాంక్‌ షేర్లు సోమవారం 7శాతం ర్యాలీ చేశాయి. ఇక్రా రేటింగ్‌ సంస్థ ధీర్ఘకాలికానికి తమ బ్యాంకు రేటింగ్‌ను ఎఎ(+)కు పెంచినట్లు శనివారం యస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఇటీవల యస్‌బ్యాంక్‌లో జరుగుతున్న అంతర్గత పరిణామాలు బ్యాంక్‌ డిపాజిట్లపై కానీ, లిక్విటిడీ ఫ్రోఫైల్‌పైగానీ ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేకపోవడంతో బ్యాంకు రేటింగ్‌ ఎఎ(+)కు పెంచుతున్నట్లు రేటింగ్‌ సం‍స్థ తెలిపింది. అలాగే నూతన సీఈవో పదవిని ఎంపిక చేసే ప్రక్రియను సెర్చింగ్‌ కమిటి వేగవంతం చేసింది. బ్యాంకు సీఈవో పదవికి  దేశీ, విదేశీ కంపెనీల్లో పనిచేసే 10మంది పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. తాజా వార్తల నేపథ్యంలో నేడు యస్‌బ్యాంక్‌ షేర్లు 3శాతం లాభంతో రూ.196.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో కొనుగోళ్లు పెరగడంతో షేరు 7శాతం లాభపడి రూ.204.50ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం 1:00లకు షేరు గతముగింపు ధర(రూ.191.3)తో పోలిస్తే 6.50శాత లాభంతో రూ.203.75ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఆగస్ట్‌ 20వ తేది షేరు రూ.404ల వద్ద ఏడాది గరిష్టాన్ని నమోదు చేయగా, సెప్టెంబర్‌ 28న రూ.166.15ల వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది.



You may be interested

ఆయిల్‌ ఇండియాకు బై రేటింగ్‌..

Monday 19th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఆయిల్‌ ఇండియాపై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఆయిల్‌ ఇండియా రేటింగ్‌: కొనొచ్చు ఇండస్ట్రీ: ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ప్రస్తుత ధర: రూ.200 టార్గెట్‌ ప్రైస్‌: రూ.221 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ఆయిల్‌ ఇండియాపై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.221గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత క్యూ2లో బలమైన ఫలితాలను ప్రకటించిందని పేర్కొంది. కంపెనీ రెవెన్యూ వార్షికంగా 51 శాతం,

ఎఫ్‌ఐఐలను, ఎంఎఫ్‌లను ఆకర్షించిన స్టాక్స్‌ ఇవే..

Monday 19th November 2018

విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు), మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌లు) పోర్ట్‌ఫోలియోలను గమనిస్తే.. గత నాలుగు త్రైమాసికాల్లో  138 స్టాక్స్‌లో వాటాలను పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ 138 స్టాక్స్‌లో 14 షేర్లు గత ఏడాది కాలంలో 20-80 శాతం మేర కరెక‌్షన్‌కు గురయ్యాయి. 8కే మైల్స్‌, సీఎల్‌ ఎడ్యుకేట్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, భన్సాలి ఇంజినీరింగ్‌, బాలాజీ టెలిఫిల్మ్స్‌, బీహెచ్‌ఈఎల్‌, అంబుజా సిమెంట్స్‌, డిక్సన్‌ టెక్నాలజీస్‌, అమృతాంజన్‌ హెల్త్‌ వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే

Most from this category