STOCKS

News


యస్‌ బ్యాంక్‌ 5% డౌన్‌

Monday 26th November 2018
Markets_main1543212401.png-22378

ముంబై: ప్రైవేట్‌ రంగానికి చెందిన యస్‌ బ్యాంక్‌ షేరు ధర సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో 5 శాతం పతనమైంది. ఇంట్రాడేలో రూ.182 వద్ద కనిష్టస్థాయిని తాకింది. ఎన్‌ఎస్‌ఈలో ఉదయం 11 గంటల సమయానికి రూ.9.30 (4.76 శాతం) నష్టపోయి రూ.186 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ట ధర రూ.404 వద్ద (ఈ ఏడాది ఆగస్టు 20న) ఉండగా, కనిష్ట ధర రూ.165 వద్ద (సెప్టెంబర్‌ 28, 2018న) నమోదైంది. స్వల్పకాలంలోనే షేరు ధరలో ఇంతటి భారీ పతనం నమోదైన నేపథ్యంలో ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళన కారణంగా షేరు ధర తాజాగా పతనమైందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లను కలిగిన రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సాధనాల రేటింగ్స్‌లో కోత ఉండవచ్చనే అంచనాల కారణంగా షేరు ధర పతనమైందని వివరించారు. 



You may be interested

కెయిర్న్​ ఎనర్జీ షేర్లు విక్రయించిన ఐటీ శాఖ

Monday 26th November 2018

న్యూఢిల్లీ: సుమారు రూ. 10,247 కోట్ల పన్ను బకాయీలను రాబట్టుకునే క్రమంలో కెయిర్న్ ఎనర్జీ షేర్లను ఆదాయ పన్ను శాఖ విక్రయించేసినట్లు తెలుస్తోంది. రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్‌ (పాత లావాదేవీలకు కూడా వర్తింపచేసే పన్ను) విధించడంపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలు ప్రకటించేందుకు మరికొన్ని రోజులు ఉందనగా ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కెయిర్న్ ఎనర్జీకి ఉన్న వాటాలను కొనుగోలు చేయడం ద్వారా కెయిర్న్ ఇండియాని వేదాంత విలీనం చేసుకున్న

ఒడిదుడుకుల వారం..!

Monday 26th November 2018

ఈ వారమే నవంబర్‌ సిరీస్‌ ఎఫ్‌అండ్‌ఓ ముగింపు -దీంతో మార్కెట్లో ఒడిదుడుకులు -ముడి చమురు ధరల గమనం -డాలర్‌తో రూపాయి మారకం -ప్రపంచ పరిణామాల ప్రభావం -ఈ వారం మార్కెట్‌కు కీలకాంశాలు స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం ఒడిదుడుకులమయంగా సాగవచ్చు. నవంబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ఈ గురువారం (ఈ నెల 29న)ముగియనుండటమే దీనికి ప్రధాన కారణం. డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, ప్రపంచ పరిణామాల ప్రభావం, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల

Most from this category