STOCKS

News


ఆగని యస్‌ బ్యాంక్‌ షేర్ల పతనం

Tuesday 13th August 2019
Markets_main1565683637.png-27737

మరో 10శాతం క్షీణించిన షేర్లు 
యస్‌బ్యాంక్‌ షేర్ల పతనం పతనం ఆగడం లేదు. మంగళవారం మరో 10శాతం నష్టపోయాయి. నేడు బీస్‌ఈలో రూ.84.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో షేర్లు ఒకదశలో 10.50శాతం నష్టపోయి రూ.73.40ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమయ్యాయి. ఈ స్థాయి షేర్లకు ఐదేళ్ల లేదా 6 ఏళ్ల కనిష్టస్థాయి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయం. ఏదశలోనూ రివకవరి సాధించకపోవడంతో మిడ్‌సెషన్‌ సమయంలోనూ 7.55శాతం నష్టంతో రూ.75.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతవారంలో రూ.2000ల కోట్ల నిధుల సమీకరణకు వచ్చిన యస్‌ బ్యాంక్‌ క్యూఐపీ ఇష్యూ 3రెట్ల ఓవర్‌స్క్రైబ్‌ అయినప్పటికీ.., షేర్లను పతనం ఆగడం లేదు. ఇప్పుడు షేర్లు క్యూఐపీ ఇష్యూ ధర(రూ.87.9)తో పోలిస్తే 15-20శాతం డిస్కౌంట్‌ ట్రేడ్‌ అవుతుండంతో గమనార్హం. అలాగే కంపెనీ నూతన కార్యదర్శక నియమకాలు చేపట్టడం కూడా కంపెనీ షేర్ల క్షీణతను అడ్డుకోలేకపోయింది. సోమవారం అనురాగ్‌ అడ్లాఖాను సీనియర్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజీ అధికారిగా నియమించింది. షేర్ల ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.73.40 రూ.404.00లుగా నమోదయ్యాయి.



You may be interested

డిస్కౌంట్‌లో 32 నిఫ్టీ షేర్లు

Tuesday 13th August 2019

మార్కెట్లు పతనం కారణంగా చాలా వరకు టాప్‌ కంపెనీల స్టాకుల వాల్యుషన్‌ తగ్గింది. దీర్ఘకాల వాల్యుషన్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం ఈ స్టాకులు డిస్కౌంట్‌తో  ట్రేడవుతున్నాయి. నీఫ్టీ 50 ఇండెక్స్‌లోని సగానికి పైగా స్టాకులు వాటి పదేళ్ల పీఈ(ప్రైస్‌ టూ ఎర్నింగ్స్‌) నిష్పత్తి సగటుతో పోల్చుకుంటే రాయితీతో ట్రేడవుతున్నాయి. పదేళ్ల పీబీ(ప్రైస్‌ టూ బుక్‌) నిష్పత్తి సగటుతో పోల్చుకుంటే నిఫ్టీ 50లోని 32 స్టాకులు ప్రస్తుతం డిస్కౌంట్‌తో ట్రేడవుతుండడం గమనార్హం.  అయినప్పటికి

నష్టాల్లో మారుతి, ఎం అండ్‌ ఎం షేర్లు

Tuesday 13th August 2019

అంతర్జాతీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతుండడంతో దేశియ మార్కెట్లు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. మధ్యాహ్నం 1.09 సమయానికి భారత్‌ ఫోర్జ్‌ (5.25 శాతం), మహింద్రా అండ్‌ మహింద్రా (ఎం అండ్‌ ఎం)(4.79 శాతం), మారుతి(2.95 శాతం) షేర్లు నష్టపోయాయి. మొత్తంగా నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 2.26 శాతం నష్టపోయి 6,976.10 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో ఇతర కంపెనీలయిన అమర్‌రాజా బ్యాటరీస్‌ 1.62 శాతం, బజాజ్‌ ఆటో

Most from this category