STOCKS

News


ఆర్‌బీఐ క్లీన్‌చిట్‌: యస్‌ బ్యాంక్‌ 29శాతం అప్‌

Thursday 14th February 2019
Markets_main1550117553.png-24185

ఎన్‌పీఏల అంశంలో కేంద్ర రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి క్లీన్‌చిట్‌ రావడంతో యస్‌బ్యాంక్‌ షేర్లు గురువారం బీఎస్‌ఈలో 10శాతం లాభంతో రూ.రూ.185.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 2015-16 కాలంలో ఎన్‌పీఏల నిర్దారణ, ప్రొవిజనింగ్‌ అంశాల విషయంలో దర్యాప్తు చేసిన ఆర్‌బీఐ యస్‌ బ్యాంక్‌ ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని తెలిపింది. ఇటీవల రాణాకపూర్‌ వ్యవహారంతో పాటు ఎన్‌పీఏల నిర్దారణ నిర్దారణ తదితర ప్రతికూలాంశాలతో భారీ నష్టపోయిన షేరు తక్కువ ధరకే లభిస్తుండంతో ఇన్వెస్టర్లు నేడు యస్‌బ్యాంక్‌ షేర్ల కొనుగోళ్లకు తెరలేపారు. ఫలితంగా షేరు ఇంట్రాడే ఏకంగా 29శాతం లాభపడి రూ.218.00ల గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.9:40ని.లకు షేరు గతముగింపు(రూ.169.05)తో పోలిస్తే 20.50శాతం లాభంతో రూ.203.55ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.185.95  రూ.218.00లుగా నమోదయ్యాయి.



You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 14th February 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు యూనిటెడ్‌ బేవరీజెస్‌:- కోర్టు అనుమతితో ఎస్‌బీఐ నేతృత్వంలో బ్యాంకుల కన్సార్టియం ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ యూనిటెడ్‌ బేవరీజెస్‌ భాగస్వామ్య సం‍స్థ హీనెకెన్ ఎన్వి ఆస్తులను వేలంవేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.  జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌:- గోల్డ్‌మెన్‌ శాచ్స్‌ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌కు కేటాయింపుతో పాటు టార్గెట్‌ ధరను రూ.315లకు పెంచింది. గత 6నెలలు 20శాతం దిద్దుబాటుకు గురైన షేరు వాల్యూవేషన్‌ ఆల్‌టైం కనిష్టానికి చేరుకుందని

సెన్సెక్స్‌ లాభం...నిఫ్టీ నష్టం

Thursday 14th February 2019

వరుస నష్టాల్ని కొనసాగిస్తూ గురువారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచి 7 పాయింట్ల నష్టంతో 10,786 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మాత్రం 30 పాయింట్ల లాభంతో 36,065 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ప్రారంభమైన కొద్ది క్షణాల్లో సూచీలు రెండూ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఆర్‌బీఐ నుంచి క్లీన్‌చిట్‌ పొందినట్లు ప్రకటించిన యస్‌ బ్యాంక్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 25 శాతం జంప్‌చేసి రూ. 215 వద్దకు చేరింది.

Most from this category