STOCKS

News


అశోక్ చావ్లా రాజీనామాతో యస్‌ బ్యాంక్‌ క్రాష్‌

Thursday 15th November 2018
Markets_main1542260549.png-22042

ముంబై: యస్‌ బ్యాంక్‌ షేరు ధర గురువారం ఉదయం 8 శాతం మేర పతనమైంది. ఇంట్రాడేలో రూ.202 కనిష్ట స్థాయిని నమోదుచేసింది. 11 గంటల సమయానికి ఏడున్నర శాతం నష్టంతో రూ.205 వద్ద కొనసాగుతోంది. నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌ (ఇండిపెండెంట్‌) చైర్మన్‌గా బ్యాంకుకు సేవలందిస్తున్న అశోక్ చావ్లా తన పదవికి రాజీనామా చేసినట్లు బుధవారం మార్కెట్‌ ట్రేడింగ్‌ ముగిసిన తరువాత బోర్డ్‌ బొంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు తెలియజేసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ చైర్మన్‌గా బాధ్యతలు కొనసాగిస్తున్న ఈయన బ్యాంక్‌ నుంచి వైదొలిగినట్లు తెలియడంతో గురువారం ఉదయం ఈ కౌంటర్‌లో అమ్మకాల ఒత్తిడి చోటుచేసుకుంది. బుధవారం రోజునే ఉత్తమ్‌ ప్రకాశ్‌ అగర్వాల్‌ను అదనపు డైరెక్టర్‌గా నిమించుకున్నట్లు బోర్డ్‌ తెలిపింది. మరోవైపు బ్యాంకులో తాకట్టు (ప్లెడ్జ్‌) కింద ఉన్నటువంటి వలేచా ఇంజినీరింగ్ షేర్లను కొనుగోలు చేసినట్లు బీఎస్‌ఈకి తెలియజేసింది. వీటిలో రూ.10 ముఖవిలువ కలిగిన 29,28,504 ఈక్విటీ షేర్లు (12.99 శాతానికి సమానం), రూ.100 ముఖవిలువ కలిగిన 2,30,655 ఈక్విటీ షేర్లు (30 శాతానికి సమానం) ఉన్నట్లు తెలిపింది. ఈ బ్యాంక్‌ షేరు 52 వారాల కనిష్టస్థాయి రూ.165, గరిష్టస్థాయి రూ.404 వద్ద ఉన్నాయి. 
 



You may be interested

టాటాల కన్ను... జెట్‌ ఎయిర్‌వేస్ 8శాతం జూమ్‌..!

Thursday 15th November 2018

తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు టాటా సన్స్‌ కసరత్తును వేగవంతం చేసిందనే వార్తల నేపథ్యంలో గురువారం జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ షేరు భారీగా లాభపడింది. విస్తారా బ్రాండు విమానయాన సేవల సంస్థను నిర్వహిస్తున్న టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్‌ షేర్ల విలీనం ద్వారా జెట్ ఎయిర్‌వేస్‌ను సొంతం చేసుకోవడానికి సిద్ధమైంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు సంబంధించి టాటా సన్స్‌ రెండో విడత చర్చలు కూడా పూర్తి చేసినట్లు

యస్‌ బ్యాంక్ చైర్మన్‌ అశోక్ చావ్లా రాజీనామా

Thursday 15th November 2018

ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్‌ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్‌టైమ్‌ చైర్మన్ అశోక్ చావ్లా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో స్వతంత్ర డైరెక్టర్ వసంత్ గుజరాతి కూడా రాజీనామా చేసినట్లు యస్‌ బ్యాంక్ బుధవారం వెల్లడించింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. అయిదేళ్ల పాటు అదనపు డైరెక్టర్‌ (స్వతంత్ర)గా ఉత్తమ్‌ ప్రకాశ్ అగర్వాల్‌ నియామకానికి బోర్డు ఆమోదముద్ర వేసినట్లు యస్‌ బ్యాంక్ తెలిపింది. బ్యాంకు

Most from this category