STOCKS

News


యస్‌ బ్యాంక్‌ జూమ్‌

Friday 10th August 2018
Markets_main1533887473.png-19120

ముంబై:- ప్రైవేట్‌ రంగ దిగ్గజం యస్‌బ్యాంకు షేరు శుక్రవారం లాభాల బాట పట్టింది. నేటి ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్‌లో 2.61శాతం వరుకు ర్యాలీ చేసింది. నేడు షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ.382.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో  పలు బ్యాకింగ్‌ రంగ షేర్లు నష్టాల బాట పట్టినప్పటికీ యస్‌ బ్యాంకు షేరు లాభాల్లో ట్రేడైంది. ఒక దశలో 2.61శాతం వరకూ  ర్యాలీ చేసి రూ.391.00ల ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం గం.12:45ని.లకు షేరు గతముగింపు(రూ.381.05)తో పోలిస్తే 2శాతం లాభంతో రూ.388.15ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ - 50 సూచీలో టాప్‌ - గెయినర్లలో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
ఈ షేరుపై ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ యాక్సిస్‌ క్యాపిటల్‌ అభిప్రాయం ఇలా ఉంది.

యాక్సిస్‌ క్యాపిటల్‌:- బై రేటింగ్ ఇచ్చింది. టార్గెట్‌ ధర రూ.400గా పేర్కొంది. స్టాప్‌ లాస్‌ రూ.370లుగా నిర్ణయించింది. రుణాల కేటాయింపు ద్వారా ఈ షేరు ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు 8శాతం ఆదాయం ఇవ్వచ్చని అంచనా వేస్తుంది. క్యూ1లో కంపెనీ సాధించిన నికర లాభం, రిటైల్‌ వ్యాపారం వృద్ధి తదితర సానుకూల అంశాలు రానున్న రోజుల్లో షేరు ర్యాలీకి సహాయపడతాయని అభిప్రాయపడుతోంది.



You may be interested

పన్నెండు వేల పాయింట్లు పక్కా!

Friday 10th August 2018

వర్ధమాన మార్కెట్లలో భారత్‌ బెస్ట్‌ మార్కెట్‌ నిపుణుడు అతుల్‌ సూరి దేశీయ మార్కెట్లు మార్చి కనిష్ఠాల నుంచి కోలుకొని ఆల్‌టైమ్‌ హైని తాకాయి. ఈ నేపథ్యంలో గత రెండు మూడునెలల్లో వర్ధమాన మార్కెట్లలో ఇండియా ఈక్విటీ మార్కెట్లే బెస్ట్‌ అని ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు, మారథాన్‌ ట్రెండ్స్‌ సీఈఓ అతుల్‌ సూరీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం యూఎస్‌ మార్కెట్లు తమ ఆల్‌టైమ్‌ హైని చేరలేక అవస్థపడుతున్నాయని, ఎంఎస్‌సీఐ వర్ధమాన మార్కెట్‌ సూచీ తన జీవిత

ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాకు బై రేటింగ్‌

Friday 10th August 2018

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌  రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.194 టార్గెట్‌ ప్రైస్‌: రూ.328 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌పై బుల్లిష్‌గా ఉంది. కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తోంది. కంపెనీ ప్రస్తుత జూన్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలు మించాయని పేర్కొంది. ఇటీవల కాలంలో స్టాక్‌ ధరలో కరెక‌్షన్‌ ఏర్పడిందని అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో అర్ధభాగంలో నాలుగు పెద్ద ప్రాజెక్టుల వల్ల ఆదాయం మరింత పెరగొచ్చని తెలిపింది.

Most from this category