STOCKS

News


యస్‌ బ్యాంక్‌కు ఓపీ భట్ రాజీనామా షాక్‌

Friday 16th November 2018
Markets_main1542357321.png-22097

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంక్‌ షేర్లకు కష్టాలు ఇప్పట్లో తీరేలాలేవు. సీఈఐ సెర్చింగ్‌ కమిటీ సభ్యుడు ఎస్‌బీఐ మాజీ చైర్మన్ ఓపీ భట్ రాజీనామాతో కంపెనీ షేర్లు శుక్రవారం మరో 8.59శాతం నష్టపోయాయి. గత ట్రేడింగ్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ అశోక్‌ చావ్లా రాజీనామా చేయడంతో బ్యాంకు షేర్లు 7.42శాతం నష్టం నష్టపోయిన సంగతి తెలిసిందే. విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాల వ్యవహారంపై భట్‌పై సీబీఐ విచారణ జరుగుతుండటంతో గురువారం ఓపీ భట్ రాజీనామా చేశారు. నేడు బీఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేర్లు రూ.200.55ల వద్ద ప్రారంభమయ్యాయి. ఓపీ భట్‌ రాజీనామా వార్తల నేపథ్యంలో నేటి ఇంట్రాడేలో యస్‌ బ్యాంకు షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకానొకదశలో షేరు 8.59శాతం నష్టపోయి రూ.188.30ల కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం గం.1:45ని.కు షేరు గత ముగింపు ధర(రూ.206)తో పోలిస్తే 7.77శాతం నష్టంతో రూ.189ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.166.15 రూ.404.00లుగా నమోదయ్యాయి.



You may be interested

దిగ్గజ బ్రోకింగ్‌ సంస్థలు మెచ్చిన 5 షేర్లు

Friday 16th November 2018

ముంబై: సీఎల్‌ఎస్‌ఏ, మోర్గాన్‌ స్టాన్లీ వంటి అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థలు దేశీ మార్కెట్‌లోని ఐదు షేర్లను కొనుగోలుచేయవచ్చని సిఫార్సు చేశాయి. ఆ వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. లెమన్‌ ట్రీ హోటల్స్: ప్రీమియం వాల్యుయేషన్స్‌ సమంజసంగా ఉన్నందున్న ఈ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. రూ.87 టార్గెట్‌ ధరను ఇచ్చింది. అసెట్‌ లైట్‌ మోడల్‌ ఆధారంగా వృద్ధి బాటా మెరుగ్గా ఉంటుందనే అంచనాను వెల్లడించింది. ఐషర్‌ మోటార్స్‌: మార్కెట్‌లోకి నూతనంగా జావా

ఏవియేషన్‌ షేర్లు ట్రేడర్లకే .. ఇన్వెస్టర్లకు కాదు..

Friday 16th November 2018

ఏవియేషన్‌ రంగాన్ని కఠినమైనదిగా భావించొచ్చు. ఇందులో కంపెనీలకు ప్రైసింగ్‌ పవర్‌ ఉండదు. భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అలాగే ఆయిల్‌ ధరలతో ఎల్లప్పుడూ రిస్క్‌ పొంచి ఉంటుంది. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏస్‌ప్రో అడ్వైజర్స్‌ సీఐవో కుంజ్‌ బన్సాల్‌ ఈ విషయాలను వెల్లడించారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ స్టాక్‌ ర్యాలీ విషయానికి వస్తే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉందని తెలిపారు. ఇటీవల కాలంలో

Most from this category