STOCKS

News


లాభాల్లో యస్‌ బ్యాంక్‌

Thursday 11th October 2018
Markets_main1539242805.png-21047

మార్కెట్‌ ట్రెండ్‌కు వ్యతిరేకంగా యస్‌ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., గురువారం యస్‌ బ్యాంకు షేర్లు దాదాపు 15శాతం వరకు లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో రూ.225.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. యస్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ పదవి నియామక కమిటి నేడు తొలిసారిగా సమావేశకానుంది. ఈ నేపథ్యంలో షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఇంట్రాడేలో 14.69శాతం లాభపడి రూ.268.45లకు చేరుకుంది. ఈ క్రమంలో 45.96 లక్షల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. మధ్యాహ్నం గం.12:30ని.లకు సూచీ గత ముగింపు ధర రూ.268.45తో పోలిస్తే దాదాపు 7.24శాతం నష్టంతో రూ.251ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు రూ.166.15 రూ.404.00లుగా నమోదయ్యాయి.



You may be interested

కనిష్టస్థాయి నుంచి రికవరీ

Thursday 11th October 2018

మిడ్‌సెషన్‌ సమయానికి మార్కెట్‌లో అమ్మకాల సునామీ తగ్గడంతో సూచీలు కనిష్టస్థాయి నుంచి రికవరీ బాట పట్టాయి. సెన్సెక్స్‌ సూచీ ఇంట్రాడే కనిష్టస్థాయి(33,723)నుంచి 548 పాయింట్లు కోలుకుని 34,270 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ సూచీ కనిష్టస్థాయి(10,138.60)నుంచి 183 పాయింట్లు రికవరీ అయ్యి 10,321.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ కనిష్టస్థాయి (24,494) నుంచి 392 పాయింట్లు లాభపడి 24886 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ

కళతప్పిన మెటల్‌ షేర్లు

Thursday 11th October 2018

మార్కెట్‌ భారీ పతనంలో భాగంగా గురువారం మెటల్‌ షేర్లు కళతప్పాయి. అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లలో నెలకొన్న అ‍మ్మకాల్లో భాగంగా నేటి ట్రేడింగ్‌లో మెటల్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎన్‌ఎస్‌ఈలోని మెటల్‌ ఇండెక్స్‌ అత్యధికంగా దాదాపు 5శాతం నష్టపోయింది. ఉదయం గం.11:30ని.లకు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3.76శాతం నష్టపోయి 3,309.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఇండెక్స్‌లోని జిందాల్‌ స్టీల్‌ అత్యధికంగా 6శాతం నష్టపోయింది. టాటాస్టీల్‌ 5శాతం నష్టపోయి నిఫ్టీ-50 సూచీలో

Most from this category