STOCKS

News


రెండోరోజూ యస్‌ బ్యాంక్‌ ర్యాలీ

Friday 25th January 2019
Markets_main1548405344.png-23804

యస్‌ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ రెండో  కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం మరో 10.50శాతం ర్యాలీ చేసింది. కొత్త  సీఈఓగా రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ నియామకం, క్యూ3 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను ఆకట్టుకోవడం, బ్రోకరేజ్‌ సంస్థలు షేరు రేటింగ్‌ను పెంచడం తదితర అంశాలు షేరు ర్యాలీకి తోడ్పాటు అందించాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ఇంట్రాడేలో మరో  14 శాతం ర్యాలీ చేసి రూ.245 వద్ద గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.213.85)తో పోలిస్తే 6శాతం లాభంతో రూ.226.40ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న మార్కెట్‌ సమయంలో క్యూ3 ఫలితాలతో పాటు, కొత్త సీఈఓగా రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ నియామకం ప్రటనతతో షేరు 9శాతం ర్యాలీ చేసి రూ.215 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కాగా షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ.147.00 రూ.404.00లుగా ఉన్నాయి.



You may be interested

ఫలితాల షాక్‌...మారుతి 8 శాతం క్రాష్‌

Friday 25th January 2019

క్యు3 ఫలితాల ఎఫెక్ట్‌ శుక్రవారం ట్రేడింగ్‌లో మారుతీ సుజుకీ షేరు దాదాపు 8 శాతం మేర నష్టపోయింది. మధ్యాహ్న సమయం వరకు స్వల్పలాభంలో ఉన్న షేరు క్యు3 ఫలితాల ప్రకటనతో అమాంతం పడిపోయింది. 2.50 నిమిషాలకు షేరు రూ6450కి అటుఇటుగా ట్రేడవుతోంది. గురువారం క్లోజింగ్‌తో పోలిస్తే ఇది 8 శాతం తక్కువ. ఒకదశలో షేరు 52 వారాల కనిష్ఠస్థాయి రూ.6410కి పతనమైంది. తిరిగి కొంత కోలుకొని రూ. 6450 వద్దకు చేరింది.

యస్‌ బ్యాంక్‌ షేరుపై బ్రోకరేజ్‌లు ఏమంటున్నాయ్‌!

Friday 25th January 2019

కొత్త సీఈఓ నియామకంతో యస్‌ బ్యాంక్‌ షేరు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి... 1. మోతీలాల్‌ ఓస్వాల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 270. మేనేజ్‌మెంట్‌ సమస్య తీరినందున ఇకపై కీలకాంశాలపై బ్యాంకు దృష్టి సారించనుంది. మూలధన సమీకరణ, కార్పొరేట్‌ గవర్నెన్స్‌, ఉద్యోగుల్లో నైతికత పెంపు తదితర అంశాలపై ఫోకస్‌ పెట్టనుంది. రాబోయే సంవత్సరాల్లో నికరలాభంలో 9- 12 శాతం వృద్ది ఉండొచ్చు. 2. ఎడెల్‌వీజ్‌: కొనొచ్చు.

Most from this category