STOCKS

News


యస్‌ బ్యాంక్‌ మళ్లీ డౌన్‌

Tuesday 20th November 2018
Markets_main1542701648.png-22226

న్యూఢిల్లీ:- యస్‌ బ్యాంకు షేర్ల లాభాలు ఒక్కరోజే పరిమితం అయ్యాయి. బోర్డు నుంచి మరో సభ్యుడి నిష్క్రమణతో మంగళవారం ఆ బ్యాంకు షేర్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి. రాణా కపూర్‌ వారసడి వెతికే ప్రక్రియను బోర్డు వేగవంతం చేసిందనే వార్తల నేపథ్యంలో సోమవారం 7శాతం లాభపడిన సంగతి తెలిసిందే.  వ్యక్తిగత కారణాలతో స్వతంత్ర్య డైరెక్టర్‌ రెంటాల చంద్రశేఖర్‌ సోమవారం రాజీనామా చేసినట్లు సంస్థ స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌లకు తెలిపింది. నాన్‌ ఎగ్జిక్యూటిక్‌ ఛైర్మన్‌ హోదా నుంచి అశోక్‌ చావ్లా, బోర్డులో సభ్యత్వం, నుంచి ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్‌ ఓపీ భట్‌ ఇటీవలే తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతికూల వార్తాంశంతో నేడు యస్‌ బ్యాంకు షేర్లు 6.50 శాతం నష్టపోయి రూ.191.75వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మధ్యాహ్నం గం:1:30ని.లకు షేరు గతముగింపు ధర(రూ.205.05)తో పోలిస్తే 6శాతం నష్టంతో రూ.193.25ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.166.15 రూ.404.00లుగా నమోదయ్యాయి.

 



You may be interested

రూపీ ర్యాలీ : ఐటీ డీలా..!

Tuesday 20th November 2018

ముంబై:- డాలర్‌ మారకంలో రూపాయి ర్యాలీ మంగళవారం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. నేటి ట్రేడింగ్‌లో రూపాయి గత ముగింపు(71.65)తో పోలిస్తే 37 పైసలు లాభపడి 71.28 స్థాయి వద్ద కనిష్టానికి చేరుకుంది. దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి వరుసగా ఆరోరోజూ లాభాల్లో ట్రేడవ్వడం విశేషం. దేశీయంగా రూపాయి బలపడుతుండటం డాలర్‌ మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ, ఫార్మా షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ

ఇండియన్‌ బ్యాంక్‌ కొనొచ్చు..

Tuesday 20th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఇండియన్‌ బ్యాంక్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: ఇండియన్‌ బ్యాంక్‌ రేటింగ్‌ కొనొచ్చు ‍ప్రస్తుత ధర: రూ.229 టార్గెట్‌ ప్రైస్‌: రూ.335 ఆనంద్‌రాఠి.. ఇండియన్‌ బ్యాంక్‌పై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.335గా నిర్ణయించింది. బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో బలహీనమైన ఫలితాలను ప్రకటించిందని పేర్కొంది. నిర్వహణ పనితీరు ఆకట్టుకోలేకపోయిందని తెలిపింది. ఎఐఐ వృద్ధి తక్కువగా ఉందని పేర్కొంది.

Most from this category