STOCKS

News


యస్‌ బ్యాంక్‌ షేర్లకు డాయిష్‌ బూస్ట్‌

Thursday 14th March 2019
Markets_main1552557447.png-24608

యస్‌ బ్యాంక్‌ షేరు టార్గెట్‌ ధరను అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ అయిన డాయిష్‌బ్యాంక్‌  పెంచడంతో గురువారం ట్రేడింగ్‌లో 4శాతం ర్యాలీ చేసింది. నేడు యస్‌ బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో రూ.247.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డాయిష్‌ బ్యాంక్ యస్‌ బ్యాంక్‌ షేర్లపై సమగ్ర నివేదికను విడుదల చేసింది. ‘‘బ్యాంకు ఆదాయాలు ఆశించిన స్థాయిలోనే ఉంటాయి.  రుణ నాణ్యత మరింత పెరిగే అవకాశం ఉంది. కార్పోరేట్‌ రుణ వృద్ధి 12-15శాతం తగ్గవచ్చు. రిటైల్‌/ఎస్‌ఎంఈ రుణ వృద్ధి మాత్రం 40-50శాతంగా ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి బ్యాంక్‌ లోక్‌బుక్‌ వృద్ధి 16-18శాతానికి పెరుగవచ్చు’’ అని డాయిష్‌ బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేసింది. ఈ క్రమంలో యస్‌ బ్యాంక్‌ షేరు గతంలో తాము కేటాయించిన రూ.280ల టార్గెట్‌ ధరను రూ.300లకు పెంచుతున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ ప్రకటించింది. అలాగే గత నెలలో మూడీస్‌ రేటింగ్‌ సంస్థ సైతం యస్‌ బ్యాంక్‌కు షేరుపై ‘‘నెగిటివ్‌’’ స్థాయి నుంచి ‘‘స్థిరత్వం’’కు పెంచిన సంగతి తెలిసిందే. ఫలితంగా షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో 4శాతం ర్యాలీ చేసి రూ.254.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.3:15ని.లకు షేరు గత ముగింపు ధర (రూ.244.35)తో పోలిస్తే 2శాతం లాభంతో రూ.249.20ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా ఈ రెండు రోజుల్లో యస్‌ బ్యాంక్‌ షేర్లు 6శాతం ర్యాలీ చేశాయి. యస్‌ బ్యాంక్‌ షేరు ధర చివరి ఏడాది కాలంలో 21.46శాతం క్షీణించగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి 38శాతం పెరిగింది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 147.00 రూ.404.00లుగా నమోదయ్యాయి.



You may be interested

ఎన్నికల తర్వాతే ఇండియాలోకి వస్తాం!

Thursday 14th March 2019

జులియస్‌ బేర్‌ అండ్‌ కో ప్రస్తుతానికి భారత్‌ కన్నా చైనా మార్కెట్‌ మంచి ప్రదర్శన చూపగలదని ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం జూలియస్‌ బేర్‌ అండ్‌ కో అభిప్రాయపడుతోంది. ఇండియా మార్కెట్లో కొనుగోళ్లకు తాము ఆసక్తిగానే ఉన్నామని, కానీ మేలో ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో? చూసిన తర్వాతే ఇండియాలోకి ఎంటరవుతామని బ్యాంకు ప్రతినిధి మార్క్‌ మాథ్యూస్‌ చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల కేంద్రబ్యాంకులు రేట్ల తగ్గింపు వాతావరణాన్ని నిర్వహిస్తున్నాయన్నారు. అయితే కంపెనీ

జర్మనీని దాటేశాం!

Thursday 14th March 2019

మార్కెట్‌ క్యాప్‌లో దూసుకుపోయిన భారత్‌ అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్‌ క్యాప్‌ ర్యాంకుల్లో భారత్‌ దూసుకుపోతోంది. తాజాగా మార్కెట్‌క్యాపిటలైజేషన్‌ లెక్కల్లో జర్మనీ మార్కెట్‌ను భారత్‌ మార్కెట్‌ దాటేసింది. ఎన్నికల్లో స్థిర ప్రభుత్వం వస్తుందన్న అంచనాలతో కొన్ని రోజులుగా దేశీయ సూచీలు ర్యాలీ జరుపుతున్నాయి. ఈ క్రమంలో దేశ ఈక్విటీ మార్కెట్‌ క్యాప్‌ 2.12 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇదే సమయంలో ఫ్రాంక్‌ఫర్ట్‌(జర్మనీ) సూచీ డాక్స్‌ మార్కెట్‌ క్యాప్‌ 2.08 లక్షల కోట్ల

Most from this category