STOCKS

News


యస్‌ బ్యాంకు షేర్లకు బ్లాక్‌డీల్‌ షాక్‌

Wednesday 9th January 2019
Markets_main1547027171.png-23487

6శాతం పతనమైన బ్యాంకు షేర్లు
భారీ మొత్తంలో జరిగిన బ్లాక్‌డీల్స్‌ యస్‌ బ్యాంక్‌ షేర్లకు షాక్‌నిచ్చాయి. ఒక ప్రైవేట్‌ కంపెనీ రెండు బ్లాక్‌డీల్‌ ద్వారా సుమారు 25లక్షల ఈక్విటీ షేర్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడంతో బుధవారం యస్‌ బ్యాంక్‌ షేర్లు 6శాతం క్షీణించాయి. నేడు బీఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు రూ.193.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో బ్లాక్‌డీల్స్‌ అంశం వెలుగులోకి రావడంతో షేరు 6శాతం నష్టపోయి 181.55ల కనిష్టానికి పతమైంది. మధ్యాహ్నం గం.3:12నిల.కు షేరు గత ముగింపు ధరతో పోలిస్తే(రూ.192.3) 3శాతం నష్టంతో రూ.187ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఒక విదేశీ పెట్టుబడి సంస్థ, ఒక దేశీయ బిలియర్‌ పెట్టుబడిదారు ఇరువురూ ఇటీవల కాలంలో రూ.160, రూ.183 ధరల వద్ద భారీ ఎత్తును యస్‌ బ్యాంక్‌కు చెందిన ఈక్విటీ షేర్లను కొనుగోళ్లు చేసినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. నేడు యస్‌ బ్యాంక్‌ కొత్త ఛైర్మన్‌ పేరును ప్రకటించనున్న తరుణంలో షేరు 6శాతానికి పైగా క్షీణించడటం గమనార్హం.



You may be interested

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ ఫలితాలు బాగుంటాయి!

Wednesday 9th January 2019

సీఎల్‌ఎస్‌ఏ అంచనా మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ బ్యాంకుల ఫలితాలు గాడిన పడతాయని అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేసింది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకుల క్యు3 ఫలితాలు అంచనాలను మించవచ్చని తెలిపింది. ముఖ్యంగా స్లిపేజ్‌లు, ఆపరేటింగ్‌ ప్రదర్శన విషయాల్లో ఈ బ్యాంకులు మెరుగుపడతాయని తెలిపింది. యస్‌బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌లాంటి బ్యాంకుల ఫలితాలపై ప్రొవిజనింగ్స్‌ భారం పడుతుందని అంచనా వేసింది. హెచ్‌డీఎఫ్‌సీ కోర్‌ ప్రాఫిట్‌లో వృద్ది ఉండొచ్చు కానీ, నికరలాభంలో మాత్రం

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాభం రూ. 985 కోట్లు

Wednesday 9th January 2019

మూడోత్రైమాసికంలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ లాభం 5 శాతం పెరిగి రూ. 985 కోట్లకు చేరింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు సంబంధించిన అధిక కేటాయింపులు బ్యాంకు లాభాలను దెబ్బతీశాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంకు 936 కోట్ల రూపాయల నికరలాభం నమోదు చేసింది. ప్రస్తుత త్రైమాసికంలో బ్యాంకు లాభం ర. 811 కోట్లు ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. తాజా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 21 శాతం

Most from this category