STOCKS

News


కొత్త సీఈవో వార్తలతో యస్‌ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

Tuesday 15th January 2019
Markets_main1547544089.png-23605

బ్యాంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో) పదవి పోటీలో డాయిష్‌ బ్యాంకు సీఈవో రవ్నీత్‌ గిల్‌ ముందంజలో ఉన్నారనే వార్తలతో మంగళవారం యస్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా ర్యాలీ చేస్తున్నాయి. నేడు బీఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేర్లు రూ.196.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రస్తుత యస్‌ బ్యాంక్‌ సీఈవో రాణా కపూర్‌ పదవీకాలం జనవరి 31న ముగియనున్న నేపథ్యంలో రవ్నీత్‌ గిల్‌తో పాటు యస్‌ బ్యాంక్‌ గ్రూప్‌ సీనియర్‌ ప్రెసిడెంట్‌ రాజత్‌ మోంజా పేర్లను ఆర్‌బీఐకు పంపించింది. వీరిద్దరిలో బ్యాంక్‌ సీఈవో పదవిని చేపట్టేందుకు రవ్నీత్‌ గిల్‌కే ఎక్కువగా అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బ్యాంకింగ్‌ రంగంలో 32 ఏళ్ల పాటు అనుభవం కలిగిన రవ్నీత్‌ గిల్‌ ప్రస్తుతం​ఇండియాలోని డాయిష్‌ బ్యాంక్‌కు 6ఏళ్ల నుంచి సీఈవోగా సేవలు అందిస్తున్నారు. ఆర్‌బీఐ క్లియరెన్స్‌ అనంతరం బ్యాంక్‌ జనవరి 31 కొత్త ఎండీ& సీఈవో పేరు ప్రకటించే ఉంది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు యస్‌ బ్యాంక్‌ అధికారులతో పాటు, రవ్నీత్‌ గిల్‌ కూడా నిరాకరించారు. కొత్త సీఈవో వార్తలు వెలుగులోకి రావడంతో యస్‌ బ్యాంక్‌ షేర్లు ఇంట్రాడేలో 5శాతం ర్యాలీ చేసి రూ.205.00ల ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. మధ్యాహ్నం గం.2:00లకు షేరు ముగింపు ధర (రూ.195.4)తో పోలిస్తే 3.50శాతం లాభంతో రూ.202ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 147.00 రూ.404.00లుగా నమోదయ్యాయి.



You may be interested

భారత మార్కెట్లపై జేఎం ఫైనాన్షియల్‌ పాజిటివ్‌

Tuesday 15th January 2019

గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లు మంచి ప్రదర్శన చూపుతాయని జేఎం ఫైనాన్షియల్స్‌ అనలిస్టు గౌతమ్‌ షా అంచనా వేశారు. గత డిసెంబర్‌లో మార్కెట్లను వెనక్కు లాగేందుకు పలు శక్తులు కాచుకుని ఉన్నాయని, కానీ దేశీయ మార్కెట్లు వాటిని ఎదుర్కొని స్థిరంగా నిలబడ్డాయని చెప్పారు. వర్దమాన మార్కెట్లలో భారత మార్కెట్‌ మంచి పనితీరు కనబరుస్తోందని, రాబోయే రోజుల్లో ఇదే జోరు కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం నిఫ్టీ 10650- 10950

ఐటీ కంపెనీల టార్గెట్‌ ధరలు తగ్గించిన మోర్గాన్‌ స్టాన్లీ

Tuesday 15th January 2019

దేశీయ ఐటీ దిగ్గజాల్లో చాలా కంపెనీల టార్గెట్‌ ధరలను అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ తగ్గించింది. టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌మహీంద్రా, మైండ్‌ట్రీ, పెరిసిస్టెంట్‌ సిస్టమ్స్‌, హెక్సావేర్‌, ఎంఫసిస్‌ షేర్ల టార్గెట్లను కుదించినట్లు తెలిపింది. భారీ వాల్యూషన్ల కారణంగా టీసీఎస్‌, పేలవ వృద్ధి అంచనాల నేపథ్యంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ టార్గెట్‌ ధరను తగ్గించామని వివరించింది. మరోవైపు ఇన్ఫోసిస్‌ లక్ష్యిత ధరను మాత్రం పెంచింది. రిస్కురివార్డు నిష్పత్తి ఆకర్షణీయంగా ఉన్నందునే

Most from this category