STOCKS

News


యస్‌ బ్యాంక్‌ 4శాతం జూమ్‌..!

Thursday 20th December 2018
Markets_main1545296831.png-23112

ప్రైవేట్‌ రంగానికి చెందిన యస్‌ బ్యాంక్‌ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో 4శాతం ర్యాలీ చేశాయి. నేడు యస్‌ బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో రూ.179.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇటీవల చైర్మన్‌ పదవికి అశోక్‌ చావ్లా రాజీనామా చేయడంతో యస్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా డైరెక్టర్లలో ఒకరైన బ్రహ్మ్‌ దత్‌ పేరును రిజర్వు బ్యాంకుకు యస్‌బ్యాంక్‌ సిఫారసు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇంట్రాడేలో షేరు 4.17శాతం లాభపడి రూ.187.10ల వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం గం.2:30ని.లకు షేరు గత ముగింపు ధర రూ.179.6తో పోలిస్తే 3.50శాతం లాభంతో రూ.186.05ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.147.00 రూ.404.00లుగా నమోదయ్యాయి. ఇదే సమయానికి మరోప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ-50 సూచీలో​3.50శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా కొనసాగుతుంది.You may be interested

బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్‌....పార్లమెంటు అనుమతి కోరిన కేంద్రం

Thursday 20th December 2018

రూ.41,000 కోట్ల అదనపు మూలధనం మూలధన ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం సాయమందించేందుకు రెడీ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.41,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని అందించేందుకు పార్లమెంట్‌ అనుమతి కోరింది. 2017 అక్టోబర్‌లో ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్ల బెయిల్‌ఔట్‌ ప్యాకేజ్‌కి ఈ నిధులు అదనం. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం రోజు ఈ అదనపు నిధులకు సంబంధించి సప్లిమెంటరీ డిమాండ్‌

ఫెడ్‌ సంకేతాలు.. భారత్‌కు మంచిదే

Thursday 20th December 2018

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వు వచ్చే సంవత్సరం వడ్డీ రేట్లను నెమ్మదిగా పెంచుతామని పేర్కొనడం భారత్‌ సానుకూల అంశమని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ అండ్‌ అడ్వైజరీ సీఈవో నిశ్చల్‌ మహేశ్వరి తెలిపారు. క్రూడ్‌ ధరలు 50 డాలర్ల దిగువుకు పడిపోవడం, రూపాయి బలపడుతుండటం, పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గడం వంటివి ఇండియన్‌ మార్కెట్‌కు సానుకూల అంశాలని పేర్కొన్నారు. అలాగే ఫెడరల్‌ రిజర్వు

Most from this category