STOCKS

News


8వారాల కనిష్టానికి యస్‌ బ్యాంకు

Friday 31st August 2018
Markets_main1535696500.png-19830

యస్‌ బ్యాంక్‌ షేరు శుక్రవారం 7శాతం వరకూ నష్టపోయి 8వారాల కనిష్టానికి చేరుకుంది. బ్యాంకు సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రాణా కపూర్‌ పదవీకాలాన్ని మరో మూడేళ్లు పొడిగించేందుకు ఆర్‌బీఐ అనుమతులిచ్చినట్లు యస్‌ బ్యాంకు గురువారం మార్కెట్‌ ముగింపు అనంతరం స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. అయితే విశ్లేషకులు మాత్రం సీవోఈ పునర్నిమాయకం చుట్టూ వివాదాలున్నట్లు సందేహం వ్యక్తపరుస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో నేడు బీఎస్‌ఈలో యస్‌ బ్యాంకు షేరు 5శాతం నష్టంతో రూ.343.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో అమ్మకాలు మరింత పెరగడంతో షేరు 7శాతం వరకూ రూ.338.00ల స్థాయికి పతనమైంది. ఇది యస్‌బ్యాంకు షేరుకు 8వారాల కనిష్టస్థాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన మొదటి ఇరవై నిమిషాల్లో ఇరు ఎక్చ్సేంజ్‌ల్లో 24.53 మిలియన్‌ ఈక్విటీ షేర్లు చేతులు మారినట్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఉదయం గం.11:15ని.లకు షేరు గతముగింపు(రూ.361.9) ధరతో పోలిస్తే 5.86శాతం నష్టంతో 340.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  సరిగ్గా వారం క్రితం(ఆగస్ట్‌ 24న) రూ.404.00ల వద్ద ఏడాది గరిష్టాన్ని తాకిన ఈ షేరు ఎనిమిది రోజుల్లోనే షేరు​14శాతం మేర నష్టపోవడం గమనార్హం. మరోవైపు ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని 5.78శాతం నష్టంతో నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 లూజర్లలో ప్రథమస్థానంలో ట్రేడ్‌ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 285.10 రూ.404.00లుగా నమోదయ్యాయి.You may be interested

ఆగస్టు ఆటో అమ్మకాలు అంతంతే?!

Friday 31st August 2018

వివిధ కారణాలతో ఆగస్టు నెల్లో ఆటో అమ్మకాలు పేలవంగా ఉంటాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేరళ వరదలు, పండుగల సీజన్‌ ఆలస్యం కావడం, కమోడిటీల ధరల పెరుగుదల, రూపీ క్షీణత, ఉత్పత్తుల ధరలు పెంచడం తదితర కారణాలు ఆటో అమ్మకాలకు భారంగా మారాయని బ్లూమ్‌బర్గ్‌ సర్వేలో పాల్గొన్న డీలర్లు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పాసింజర్‌ వాహనాలైన కార్లు, యుటిలిటీ వాహనాల విక్రయాలు బాగా దెబ్బతినవచ్చన్నారు. దేశంలో అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు

పన్నెండు వేల పాయింట్లు పక్కా?!

Friday 31st August 2018

నిఫ్టీపై సెంట్రమ్‌ బ్రోకింగ్‌ అంచనా జూలై సీరిస్‌లో మంచి బౌన్స్‌బ్యాక్‌ అనంతరం సూచీలు ఆగస్టులో తమ జోరు కొనసాగించాయి. ఆగస్టు సీరిస్‌లో నిఫ్టీ దాదాపు 4.5 శాతం లాభపడింది. ఇకముందు కూడా ఇదే ఊపు కనపిస్తుందని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ అంచనా వేసో​‍్తంది. నిఫ్టీ త్వరలో 12వేల పాయింట్లను చేరవచ్చని అభిప్రాయపడింది. జూలై, ఆగస్టు సీరిస్‌ల్లో ఏర్పడిన లాంగ్స్‌ సెప్టెంబర్‌కు రోలోవర్‌ అయ్యాయని తెలిపింది. సెప్టెంబర్‌ సీరిస్‌లో రోలోవర్లు 68.37 శాతంగా నమోదయ్యాయి.

Most from this category