STOCKS

News


ఏడాది కనిష్టానికి యస్‌ బ్యాంక్‌

Wednesday 15th May 2019
Markets_main1557905458.png-25750

యస్‌ బ్యాంకు షేర్లు బుధవారం ఏడాది కనిష్టానికి పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో రూ.154.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపడంతో 6శాతం నష్టంతో రూ. 146.85ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. ఈ ధర షేరు ఏడాది కనిష్ట ధరని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యస్ బ్యాంక్ అదనపు డైరెక‍్టరుగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ డిప్యుటీ గవర్నర్ ఆర్ గాంధీ నియమితులమైన సంగతి తెలిసిందే. కేర్‌, బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌, ఇండియా రేటింగ్స్‌ ఇక్రా లాంటి ప్రముఖ రేటింగ్‌ సంస్థలు షేరుకు ధీర్ఘకాలంలో షేరుకు ధీర్ఘకాలానికి  నెగిటివ్‌ అవుట్‌లుక్‌ కేటాయింపుతో పాటు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసిన నేపథ్యంలో యస్‌ బ్యాంకు షేర్లు గడిచిన నెలరోజుల్లో 44శాతం పతనమైంది. ఇక బ్యాంక్ అదనపు డైరెక‍్టరుగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ డిప్యుటీ గవర్నర్ ఆర్ గాంధీ నియమితులయ్యారు. 2019 మే 14 నుంచి రెండేళ్ల పాటు (2021 మే 13 దాకా) ఆయన పదవీకాలం ఉంటుందని స్టాక్ ఎక్స్చేంజీలకు యస్ బ్యాంక్ తెలిపింది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.146.85 రూ.404.00లుగా నమోదయ్యాయి. 



You may be interested

లాభాల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 15th May 2019

మార్కెట్‌ ఒడిదుడుకుల ర్యాలీలో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ స్వల్ప లాభంతో ట్రేడ్‌ అవుతోంది. ప్రైవేట్‌రంగ షేర్ల ర్యాలీ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ లాభపడేందుకు దోహదపడుతుంది. ఆర్‌బీఎల్‌ అ‍త్యధికంగా 2శాతం, కోటక్‌ బ్యాంక్‌ 1.50శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.80శాతం లాభపడ్డాయి. ఎస్‌బీఐ బ్యాంక్, పీఎన్‌బీ ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. అలాగే ఇదే ఇండెక్స్‌లోని యస్‌బ్యాంక్‌ షేర్లు 6శాతం నష్టపోయాయి. ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ 1శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా,

క్యాష్‌బ్యాక్ మోసం @ రూ. 10 కోట్లు

Wednesday 15th May 2019

పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వాట్సాప్‌పై యూటర్న్ ముంబై: ఉద్యోగులు, వ్యాపారులు కలిసి కుమ్మక్కై చేసిన క్యాష్‌బ్యాక్‌ మోసం పరిమాణం దాదాపు రూ. 10 కోట్లు ఉంటుందని తమ అంతర్గత విచారణలో తేలినట్లు చెల్లింపుల సేవల సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఈ మోసం బైటపడిన నేపథ్యంలో వందల కొద్దీ విక్రేతలను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించడంతో పాటు పలువురు ఉద్యోగులను తప్పించినట్లు వివరించారు. "దీపావళి తర్వాత

Most from this category