STOCKS

News


యస్‌ బ్యాంక్‌ 4 శాతం ఢౌన్‌

Wednesday 12th June 2019
Markets_main1560332649.png-26254

రేటింగ్‌ను తగ్గించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ప్రకటించడంతో యస్‌ బ్యాంక్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్లో 4శాతం నష్టపోయాయి. నేడు ఈ కంపెనీ షేరు బీస్‌ఈలో రూ.136.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్యాంకింగేతర సంస్థలకు అధిక స్థాయిలో రుణాలను మంజూరీ చేసిన నేపథ్యంలో బ్యాంక్‌ రేటింగ్‌ తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ సంకేతాలిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు ‘బీఏ1’ రేటింగ్‌ ఉండగా.. ఇందులో సవరణ జరిగే అవకాశం ఉందనే దిశగా మూడీస్‌ వ్యాఖ్యలు చేసింది. యస్‌ బ్యాంక్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్న డైరెక్టర్‌ ముఖేష్ సభర్వాల్ రాజీనామా చేయడం కూడా షేర్ల ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ బ్యాంకు షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు 4శాతం నష్టపోయి రూ. 133.80ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గత ముగింపు(రూ.139.3)తో పోలిస్తే 3శాతం నష్టంతో రూ134.55ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 133.05 రూ.404.00లుగా నమోదయ్యాయి. ఈ గత ఐదు ట్రేడింగ్‌ సెషన్స్‌లో 11శాతం నష్టపోగా, మూడు నెలల్లో ఏకంగా 42శాతం నష్టపోయింది. 

ఇక ఇదే సమయానికి సెన్సెక్స్‌ 183 పాయింట్లు నష్టపోయి 39,766.79 వద్ద, నిఫ్టీ 63.85 పాయింట్ల నష్టంతో 11901.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

మూడురోజుల లాభాలకు బ్రేక్‌

Wednesday 12th June 2019

మార్కెట్‌ ర్యాలీ మూడు రోజుల ముచ్చటగానే మిగిలింది. సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 193 పాయింట్ల నష్టంతో 39,757 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లను కోల్పోయి 10906 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని నెలకొన్న ప్రతికూల సంకేతాలకు తోడు సూచీల మూడు రోజుల ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, నేటి మార్కెట్‌ ముగింపు అనంతరం విడుదల కానున్న ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత తదితర

రికవరి బాటలో పసిడి ధర

Wednesday 12th June 2019

రికవరి బాటలో పసిడి ధర క్రితం ట్రేడింగ్‌లో వారం కనిష్టానికి పతనమైన పసిడి ధర బుధవారం రికవరీ బాట పట్టింది. నేటి ఆసియా ట్రేడింగ్‌లో 10డాలర్లు లాభపడింది. మధ్యాహ్నం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1,341.35డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనా, అమెరికా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు మళ్లీ తెరపైకి రావడంతో మార్కెట్ల సెంటిమెంట్‌ బలహీనపడింది. ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు

Most from this category