STOCKS

News


డాలర్‌ బాండ్‌ మార్కెట్‌లో యస్‌ బ్యాంక్‌ భారీ పతనం

Wednesday 28th November 2018
Markets_main1543398024.png-22455

  • హాంగ్ కాంగ్‌లో 3.3 సెంట్లు తగ్గి 88.2 సెంట్లకు పతనం
  • ఈ ఏడాదిలో 5.2 శాతం తగ్గుదల
  • భవిష్యత్‌ నిధుల సమీకరణ ఇబ్బందిగా మారే అవకాశం

యస్‌ బ్యాంక్‌ జారీ చేసినటువంటి డాలర్‌ బాండ్‌ విలువ ఒక్కసారిగా పడిపోయింది. ప్రైవేట్ రంగానికి చెందిన ఈ బ్యాంక్‌ క్రెడిట్‌ రేటింగ్‌ను ‘జంక్‌’ రేటింగ్‌కు కుదించినట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించిన నేపథ్యంలో బాండ్‌ విలువ రికార్డు స్థాయి కనిష్టానికి కుంగిపోయింది. ఈ రేటింగ్‌ సంస్థ పర్యవేక్షిస్తున్న బ్యాంకుల జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు ఉండగా.. జంక్‌ రేటింగ్‌ను కలిగిన బ్యాంకింగ్‌ సంస్థ యస్‌ బ్యాంక్‌ మాత్రమే కావడంతో డాలర్‌ బాండ్‌ మార్కెట్‌లో విలువ కనిష్టస్థాయిలకు పడిపోయింది. హాంగ్ కాంగ్‌లో డాలర్‌ బాండ్‌ విలువ 3.3 సెంట్లు తగ్గి 88.2 సెంట్లకు క్షీణించింది. జనవరి నుంచి ఇప్పటివరకు 5.2 శాతం తగ్గుదలను నమోదుచేసింది. ఈ ఏడాదిలో ఫిక్సిడ్‌ రేట్లతో బాండ్లను జారీ చేసిన భారత కార్పొరేట్లలో అత్యంత భారీగా పడిపోయిన రెండవ సంస్థగా మారింది. 

నూతన సీఈఓ ఎంపిక ప్రక్రియ, డైరెక్టర్ల రాజీనామాలు, కార్పొరేట్ గవర్నెన్స్‌పై వివాదాలతో సతమతమవుతున్న ఈ బ్యాంక్‌ క్రెడిట్‌ రేటింగ్‌ను మంగళవారం మూడీస్ కుదించింది. ఈ ప్రతికూల అంశం కారణంగా ఇకపై విదేశీ నిధుల సమీకరణలో సమస్యలు ఎదురుకావచ్చనే అంచనాల నేపథ్యంలో షేరు ధర రెండు రోజుల్లోనే 10 శాతం పతనమైంది. బుధవారం ట్రేడింగ్‌లో రూ.164.20 వద్దకు పతనమై 52 వారాల కనిష్టస్థాయిని నమోదుచేసింది.



You may be interested

ఎన్‌సీడీల జారీకి సిద్ధమైన పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌

Wednesday 28th November 2018

ముంబై: నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లు (ఎన్‌సీడీ)ను జారీ చేయడం ద్వారా రూ.500 కోట్లను సమీకరించనున్నట్లు పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్దతిలో ఈ మొత్తాన్ని సమీకరించేందుకు బోర్డులోని పరిపాలనా కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిపింది. తొలుత రూ.400 కోట్లను, ఓవర్‌సబ్‌స్క్రైబ్‌ అయిన పక్షంలో మరో రూ.100 కోట్లను కలిపి మొత్తంగా రూ.500 కోట్ల ఇష్యూ సైజ్‌కు బోర్డు నిర్ణయించిందని సంస్థ బీఎస్‌ఈ ఫైలింగ్‌ ద్వారా వెల్లడించింది. ఈ

యస్‌ సెక్యూరిటీస్‌ ప్రెసిడెంట్‌గా అంబానీ..

Wednesday 28th November 2018

యస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా ప్రెసిడెంట్‌, హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌గా అమర్‌ అంబానీ నియమితులయ్యారు. యస్‌ బ్యాంక్‌కు చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, బ్రోకరేజ్‌ సబ్సిడరీయే ఈ యస్‌ సెక్యూరిటీస్‌. ‘అమర్‌ అంబానీకి అభినందనలు తెలియజేస్తున్నాను. అమర్‌, ఈయన బృందం యస్‌ సెక్యూరిటీస్‌ ప్రయాణంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉంది. వీరంతా సంస్థ మార్కెట్‌ యాక్సెస్‌ను, సముపార్జన సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తారని విశ్వసిస్తున్నాను’ అని యస్‌ సెక్యూరిటీస్‌ చైర్మన్‌ రాణా

Most from this category