STOCKS

News


ఆర్‌బీఐ హెచ్చరిక: యస్‌ షేర్ల పతనం

Monday 18th February 2019
Markets_main1550482425.png-24247

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) హెచ్చరికతో యస్‌ బ్యాంక్‌ షేర్లు సోమవారం 8శాతం నష్టపోయాయి. యస్ బ్యాంక్‌కు సంబంధించి 2017-18లో ఆస్తుల వర్గీకరణ, కేటాయింపుల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని ఆర్‌బీఐ గతవారం ధ్రువీకరించింది. రహస్యంగా ఉంచాల్సిన ఆర్‌ఏఆర్‌ నివేదికను యస్ బ్యాంక్‌ను బహిర్గతం చేసింది. ఇది నిబంధనలను ఉల్లంఘించడం కిందకే వస్తుందని, అందుకు తగిన చర్యలు తర్వలో తీసుకుంటామని ఆర్‌బీఐ యస్‌ బ్యాంక్‌ను హెచ్చరించింది. ఆర్‌బీఐ హెచ్చరికత నేపథ్యంలో నేడు బీఎస్‌ఈలో యస్‌బ్యాంక్‌ షేర్లు 8శాతం నష్టంతో రూ.201.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో మరో అరశాతం నష్టపోయి రూ.201.00ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. అయితే ఇంట్రాడే అమ్మకాలు కాస్త తగ్గుముఖంతో షేరు రికవరీని అయ్యింది. మధ్యాహ్నం గం. 2:30ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.218.7)తో పోలిస్తే 3శాతం నష్టంతో రూ.212.50ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 సూచీలోని 3శాతం నష్టంతో టాప్‌-5 లూజర్లలో మొదటి స్థానంలో కొనసాగతుంది.



You may be interested

వాటా విక్రయ వార్తలతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్ల ర్యాలీ

Monday 18th February 2019

గృహ రుణ సంస్థ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్ప్‌ లిమిటెడ్‌ షేర్లు సోమవారం 10శాతం లాభపడ్డాయి. బారింగ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ, బైన్‌ క్యాపిటల్‌, హీరోపిన్ కార్ప్‌ కంపెనీలు వివిధ మార్గాల ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీలోని 10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు ఎకనామిక్స్‌ టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. వాటా విక్రయ వార్తలతో నేడు బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 10శాతం ర్యాలీ చేసి రూ.135.40ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని

పటిష్టంగా పసిడి..

Monday 18th February 2019

మాంద్యం, డాలర్‌ భయాలతో మరింత పెరిగే అవకాశాలు న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మరోసారి మాంద్యం ముప్పు భయాలు, డాలర్ ర్యాలీకి ఇక బ్రేక్ పడొచ్చన్న అంచనాలు పసిడికి ఊతమివ్వొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. డాలర్‌ బలంగా ఉన్న పరిస్థితుల్లో కూడా పసిడి రేట్లు పటిష్టంగానే కొనసాగుతుండటం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. బంగారం రేట్ల పెరుగుదల మరీ దూకుడుగా లేకపోయినప్పటికీ.. వారాంతంలో కీలకమైన 1300 డాలర్ల ధర (ఔన్సుకి - 31.1 గ్రాములు) పైన ముగియడం

Most from this category