News


యస్‌ బ్యాంక్‌: పతనమే అవకాశం

Friday 21st September 2018
Markets_main1537517519.png-20442

యస్‌ బ్యాంక్‌ను నడిపించే తదుపరి వ్యక్తి ఎవరో మార్కెట్‌కు ఇంకా తెలియదు. ఇదే అంశం వల్ల సమీప కాలంలో బ్యాంక్‌పై కొంత ప్రతికూల ప్రభావం చూపొచ్చని ఇండియా ఇన్ఫోలైన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెట్స్‌, కార్పొరేట్ వ్యవహారాలు) సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
ఇన్వెస్టర్లు యస్‌ బ్యాంక్‌ షేరును రూ.400 నుంచి విక్రయిస్తూ వస్తున్నారని సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. యస్‌ బ్యాంక్‌ షేరు ధర బుధవారం రూ.329 వద్ద ఉంది. రాణా కపూర్‌ విషయాన్ని పక్కన పడితే.. ఆర్‌బీఐ పరిశీలనల్లో మొండి బకాయిలు వంటి పలు ఇతర సమస్యలు కూడా ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. రాణా కపూర్‌ బ్యాంక్‌కు స్టీరింగ్‌లా వ్యవహరించారని, మార్కెట్‌ క్యాప్‌ను రూ.75,000 కోట్ల స్థాయి వరకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. ఇక ఆయన తన బాధ్యతల నుంచి వైదొలగాల్సి ఉందని, ఈ అనిశ్చిత పరిస్థితుల్లో స్టాక్‌ కొత్త కనిష్ట స్థాయిలకు చేరొచ్చని పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం యస్‌ బ్యాంక్‌ రూ.280 కనిష్ట స్థాయికి పతనమైందని తెలిపారు. ఈ స్థాయిలో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రతికూలతలు చాలావరకు ఇప్పటికే ప్రభావం చూపించేశాయని తెలిపారు. బాండ్‌ ఈల్డ్‌ పెరుగుదల, రూపాయి బలహీనత, సెంటిమెంట్‌ తగ్గడం వంటి ప్రతికూలతలను చూశామని పేర్కొన్నారు. వచ్చే వారానికల్లా బ్యాంక్‌ తదుపరి చీఫ్‌ ఎవరో ప్రకటన రావొచ్చని అంచనా వేశారు. అందువల్ల ప్రస్తుతం ఇదే కొనుగోలుకు మంచి అవకాశమని తెలిపారు. 
యస్‌ బ్యాంక్‌ స్టాక్‌ 2005లో మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యిందని, అప్పటి నుంచి చూస్తే దాదాపు 33-35 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. ఇన్వెస్టర్లకు సంపద సృష్టించిందని తెలిపారు. రాణా కపూర్‌ ఇందుకు కారణమని పేర్కొన్నారు. బ్యాంక్‌ వృద్ధి చెందిందని, ఇక ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సరైన వ్యక్తి అవసరమని అభిప్రాయపడ్డారు. అందువల్ల మేనేజ్‌మెంట్‌ మంచి సామర్థ్యమున్న వ్యక్తిని ఎంచుకోవాల్సి ఉందని తెలిపారు. క్యాపిటల్‌ సమీకరణ అంశం ప్రధానమైందని పేర్కొన్నారు. ఈల్డ్స్‌ కారణంగా వ్యయాలు కొంత ఎక్కువగా ఉన్నా కూడా.. ఇది యస్‌ బ్యాంక్‌ వంటి బ్యాంకులకు పెద్ద సమస్య కాదని తెలిపారు. బ్యాంక్‌ ఇప్పటికే తన సత్తా నిరూపించుకుందన్నారు. యస్‌ బ్యాంక్‌ స్టాక్‌ ధర 275-280 స్థాయిలకు పడిపోతే అది నిజమైన కొనుగోలు అవకాశమని తెలిపారు. మంచి పనితీరు కనబరిచే బ్యాంక్‌లలో యస్‌ బ్యాంక్‌ ఒకటని గుర్తు చేశారు. ఎన్‌పీఏలు, క్యాపిటల్‌ అడెక్వసీపై సందేహాలున్నా కూడా బ్యాంక్‌ వీటిని అధిగమించగలదని పేర్కొన్నారు. You may be interested

అంచనాల కన్నా ఎక్కువ పతనం!

Friday 21st September 2018

యస్‌ బ్యాంక్‌ స్టాక్‌పై హేమింద్ర హజారి యస్‌ బ్యాంక్‌ స్టాక్‌ అంచనాల కన్నా ఎక్కువగా పడొచ్చని మార్కెట్‌ నిపుణులు హేమింద్ర హజారి అంచనా వేశారు. బ్యాంక్‌ వారసత్వ సమస్య క్లిష్టమైనదని, దీని వల్ల అస్థిరత నెలకొంటుందని, అలాగే సవాళ్లు పొంచి ఉంటాయని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ‘బ్యాంక్‌ ప్రమోటర్ల మధ్య 2014లో నెలకొన్న వివాదం తర్వాత.. బాంబే హైకోర్టు.. ఇద్దరి ప్రమోటర్ల

భ్యాంకింగ్‌ షేర్లలో అ‍మ్మకాలు

Friday 21st September 2018

ముంబై:- మార్కెట్‌లో ఒక్కసారిగా నెలకొన్న అమ్మకాల సునామీలో భాగంగా బ్యాంక్‌ షేర్లు నిలువునా పతనమవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 4శాతం, నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 3.50శాతం, నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 4.50శాతం నష్టపోయాయి. నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌:- అమ్మకాల వెల్లువతో ఇంట్రాడేలో 4శాతం(757 పాయింట్లు) పతనమైంది. ఈ సూచీలోని 10 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా యస్‌బ్యాంక్‌ 30శాతం నష్టపోయింది.

Most from this category