ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన స్టాక్స్!
By Sakshi

ఇన్వెస్టర్లకు 2017 తీపి లాభాలను అందించగా, 2018 మాత్రం చేదునే మిగిల్చింది. ఎన్నో ఆటుపోట్ల మధ్య లాభాలు ఆవిరైపోయిన పరిస్థితి. ఈ ఏడాదిలో ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ రంగ స్టాక్స్ మంచి పనితీరు చూపించగా, పీఎస్‌యూ బ్యాంకులు, ఇన్ఫ్రా, మెటల్స్, ఫార్మా, ఆటో, రియల్టీ, స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు నష్టాల పాలయ్యాయి. ఎన్ఐఐటీ టెక్నాలజీస్, వీమార్ట్, హెచ్ఈజీ, వినతి ఆర్గానిక్స్ వంటి కంపెనీలు అద్భుత రాబడులను ఇచ్చాయి. కానీ, ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన షేర్లు కూడా ఉన్నాయి. అద్భుత లాభాలు భారీ నష్టాలు
ఎన్ఐఐటీ టెక్నాలజీస్ 2018లో ఇప్పటి వరకు 76 శాతం పెరిగింది. వీమార్ట్ రిటైల్ 75 శాతం, హెచ్ఈజీ 72 శాతం, వినతి ఆర్గానిక్స్ 67 శాతం, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 62 శాతం, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ 60 శాతం, వీఐపీ ఇండస్ట్రీస్ 50 శాతం, ఇండియాబుల్స్ వెంచర్స్ 50 శాతం, టీసీఎస్ 47 శాతం, బాటా ఇండియా 46 శాతం, మైండ్‌ట్రీ 42 శాతం, బజాజ్ ఫైనాన్స్ 41 శాతం, జుబిలంట్ ఫుడ్‌వర్క్స్ 41 శాతం, టెక్ మహీంద్రా 41 శాతం, రాడికో ఖైతాన్ 40 శాతం చొప్పున రాబడులను ఇచ్చాయి.
కార్పొరేట్ గవర్నెన్స్, అధిక రుణాలు, లిక్విడిటీ అంశాలు తదితర కారణాలు కంపెనీల స్టాక్స్‌ను భారీగా కూలదోశాయి. 66 శాతం నుంచి 92 శాతం మధ్యలో నష్టపోయాయి. వీటిని చూస్తే... క్వాలిటీ 92 శాతం ఈ ఏడాది పతనమైంది. ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్ 87 శాతం, 8కే మైల్స్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ 82 శాతం, పీసీ జ్యుయలర్ 82 శాతం, మన్‌పసంద్ బెవరేజెస్ 80 శాతం, నవ్కార్ కార్పొరేషన్ 75 శాతం, జైప్రకాష్ అసోసియేట్స్ 73 శాతం, శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ 71 శాతం, జెట్ ఎయిర్వేస్ 69 శాతం, హిందుస్తాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ 69 శాతం, జిందాల్ స్టెయిన్లెస్ 68 శాతం, శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ 67 శాతం, ఇన్ఫీబీమ్ అవెన్యూస్ 67 శాతం, వొడాఫోన్ ఐడియా 66 శాతం, రిలయన్స్ నేవల్ అండ్ ఇంజనీరింగ్ 66 శాతం చొప్పున నష్టపోయాయి. మొత్తం మీద 2018లో 279 స్టాక్స్ 50 శాతానికి పైగా పతనమయ్యాయి. వీటిలో ఓ కంపెనీ పరిస్థితి మరీ నివ్వెరపరిచేలా ఉంది. టెక్స్టైల్ కంపెనీ ఆశాపుర ఇంటిమేట్స్ ఫ్యాషన్ లిమిటెడ్ షేరు ధర సెప్టెంబర్ 27న రూ.431. డిసెంబర్ 20న రూ.19.20. రెండు నెలల్లో 95 శాతం తుడుచుకుపోయింది. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు, ఎండీ హర్షద్ ఠక్కర్ అక్టోబర్ 2 నుంచి కనిపించడం లేదంటూ పోలీసు కేసు దాఖలవడమే షేరు కుదేలవడానికి కారణం. అందుకే అంతగా పరిజ్ఞానం లేనివారు మ్యూచువల్ ఫండ్స్‌ను ఆశ్రయించడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తుంటారు.
You may be interested
నేడు స్టాక్ మార్కెట్‌కు సెలవు
Tuesday 25th December 2018క్రిస్మస్ సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్‌కు సెలవు. కమోడిటీ ఫ్యూచర్ మార్కెట్‌కు సైతం సెలవు. ట్రేడింగ్ తిరిగి రేపు (బుధవారం) జరుగుతుంది.
ఐపీవోకు దరఖాస్తు చేసుకున్న శ్రీరామ్ ప్రాపర్టీస్
Monday 24th December 2018రియల్ ఎస్టేట్ సంస్థ శ్రీరామ్ ప్రాపర్టీస్ సెబీ వద్ద ఐపీవో ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.1,250 కోట్లను సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యం. రూ.250 కోట్ల విలువ మేర తాజా షేర్లను ఈ ఐపీవోలో భాగంగా ఆఫర్ చేస్తారు. వీటికి తోడు ప్రస్తుత వాటాదారులు టాటా క్యాపిటల్ ఫైనాన్స్ సర్వీస్, టీపీజీ ఏషియాలు కలసి తమకున్న వాటాల నుంచి 4,24,03,271 షేర్లను విక్రయించనున్నాయి.