STOCKS

News


భారీ నష్టాలను మిగిల్చిన అక్టోబర్‌

Thursday 1st November 2018
Markets_main1541095980.png-21647

ఇన్వెస్టర్లకు 2009 తర్వాత అత్యంత నష్టాలను మిగిల్చిన మాసం ఈ ఏడాది అక్టోబర్‌. గత నెలలోనే నిఫ్టీ 10,004 పాయింట్ల కనిష్ట స్థాయి వరకూ పడిపోగా, సెన్సెక్స్‌ 33,776 వరకు తగ్గి ఆ తర్వాత కొంత రికవరీ అయ్యాయి. ఒక్క గత నెలలో ఇన్వెస్టర్లు రూ.6 లక్షల కోట్ల మేర తమ వాటాల విలువను నష్టపోయారు. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.144.86 లక్షల కోట్ల వద్ద సెప్టెంబర్‌ 28న ఉండగా, అక్టోబర్‌ 31వ తేదీన రూ.138.45 లక్షల కోట్ల స్థాయికి తగ్గిపోయింది. రూపాయి పతనం, చమురు ధరల పెరుగుదల, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ రుణ సంక్షోభం, అమెరికాలో బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల తదితర అంశాలన్నీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దిగజార్చాయి.


 
బీఎస్‌ఈ 500లోని 298 కంపెనీలు (60 శాతం) ప్రతికూల రిటర్నులు (నష్టాలు) ఇచ్చాయి. ఇందులో 18 స్టాక్స్‌ 20 నుంచి 60 శాతం మధ్యలో ఒక్క నెలలోనే నష్టపోయాయి. వీటిలో 8కే మైల్స్‌, క్వాలిటీ, ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌, బోంబే డైయింగ్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, బంధన్‌ బ్యాంకు, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌, టాటా మోటార్స్‌ ఉన్నాయి. చారిత్రకంగా చూస్తే అమెరికాలో, అంతర్జాతీయంగాను అక్టోబర్‌ ఎక్కువగా నష్టాలు ఇచ్చే మాసంగానే నిలిచిపోతుంది. 2008, 1997, 1989, 1979, 1978 సంవత్సరాల్లోనూ అక్టోబర్‌లో భారీ నష్టాలు ఎదురైనట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కొంది. కరెక్షన్‌ నేపథ్యంలో భయపడకుండా మంచి స్టాక్స్‌ కొనుగోలుకు అవకాశంగా వినియోగించుకోవాలని అనలిస్టులు సూచిస్తున్నారు. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ విభాగాల్లో ఎంపిక చేసిన స్టాక్స్‌ సమీప కాలంలో మంచి రాబడులను ఇవ్వగలవని పేర్కొంటున్నారు.  

 

‘‘ఇన్వెస్టింగ్‌లో ఇదొక భాగం. భయపడి మ్యూచువల్‌ ఫండ్స్‌, స్టాక్స్‌లోని పెట్టుబడులను వెనక్కి తీసేసుకోకూడదు. బేర్‌ మార్కెట్లు అ‍న్నవి బుల్‌ మార్కెట్ల కంటే స్వల్ప కాలం పాటే ఉంటాయి. అందుకే దీన్ని అధిగమించాలి. రానున్న 2-3 ఏళ్లలో స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో సంపద సృష్టి సాధ్యమవుతుంది. అదే సెన్సెక్స్‌, నిఫ్టీలోని అధిక వెయిటేజీ కలిగిన కంపెనీలు, అధిక బేస్‌ ప్రభావం (గతంలో అధిక వృద్ధి) కారణంగా తిరిగి ఆదాయ వృద్ధిని చేరుకోవడడం సవాలే’’ అని ఎలిక్సిర్‌ ఈక్విటీస్‌ డైరెక్టర్‌ దీపన్‌ మెహతా తెలిపారు. గత నెలలో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ విభాగంలో 40 స్టాక్స్‌ 20-75 శాతం మధ్య పడిపోయాయి. వీటిలో ఆషాపుర ఇంటిమేట్స్‌, మెక్‌నల్లీభారత్‌, జే కుమార్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌, ఇండోసోలార్‌, డిష్‌ టీవీ, ఆర్కిడ్‌ ఫార్మా, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ ఉన్నాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌లో 13 కంపెనీలు గత నెలలో 10-20 శాతం మధ్యలో నష్టపోయాయి. బేయర్‌ క్రాప్‌ సైన్సెస్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, ఎంఫసిస్‌, క్రిసిల్‌, ఇమామి, సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఉన్నాయి. You may be interested

10450లపై ప్రారంభమైన నిఫ్టీ

Friday 2nd November 2018

ప్రపంచమార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభంతో ప్రారంభమైంది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌ 260 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 10450పైన ప్రారంభమయ్యాయి. చైనాతో నెలకొన్న వాణిజ్య వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో ప్రపంచమార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నేడు ఆసియాలో కూడా అన్ని మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. అంతర్జాతీయంగా

టెలికం వినియోగదారులపై ఇక ధరల మోత!

Thursday 1st November 2018

టెలికం మార్కెట్లో జియో రాక ముందు వరకు కస్టమర్లు అధిక చార్జీల భారం భరించే వారు. 2016లో జియో అడుగు పెట్టడంతో కస్టమర్లపై పన్నీరు చల్లినట్టయింది. వాయిస్‌కాల్స్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌ల ధరలన్నీ నేలపైకి దిగొచ్చాయి. జియో ఇప్పటికీ ధరలు, సేవల విషయంలో దూకుడు కొనసాగిస్తూనే ఉంది. అయితే, జియో కారణంగా రెండేళ్లపాటు భారీ లాభాలను కోల్పోయిన ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలు ఇప్పుడు కస్టమర్లపై ధరల బాదుడుకు రెడీ అయిపోయాయి. ఇన్నాళ్లు

Most from this category