STOCKS

News


మిడ్‌క్యాప్‌ ఐటీ భేష్‌

Tuesday 4th December 2018
Markets_main1543919819.png-22621

ముంబై: దేశీ స్టాక్‌ సూచీలు ముడిచమురు ధరల ఒడిదుడుకులకు, రూపాయి కదలికలకు నాట్యం చేశాయని వ్యాఖ్యానించిన ప్రముఖ స్మాల్‌క్యాప్‌ ఇన్వెస్టర్ పొరింజు వెలియాత్.. అసలైన సవాళ్లు మార్కెట్‌లో ఇంకా ఉన్నాయని అన్నారు. వాణిజ్య యుద్ధం, ఎన్‌బీఎఫ్‌సీ అంశాలను మార్కెట్‌ మరీ అతిచేసి చూసిందని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించిన ఆయన.. ఇప్పుడు ఈ అంశాలను సాధారణంగా చూస్తూ ర్యాలీకి ఒక కారణంగా చూపుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలో కచ్చితంగా ట్రెండ్‌ రివర్స్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని తాను భావిస్తున్నట్లు చెప్పారు. నూతన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మార్కెట్‌లో పెట్టేందుకు ఇది సరైన సమయంగా ఉండనుందని సూచించించారు. మిడ్‌క్యాప్‌ ఐటీ రంగంలో అవకాశాలను చూ‍స్తున్నట్లు వివరించిన ఆయన గడిచిన రెండు బుల్‌రన్స్‌లోనూ వీటిని మార్కెట్‌ పూర్తిగా విస్మరించినట్లు తెలిపారు. ఇందువల్ల పీఈ మల్టీపుల్స్‌ చాలా తక్కువగా ఉన్నాయన్నారు. డీమానిటైజేషన్‌ కారణంగా గృహ నిర్మాణ సంస్థలు సమస్యలను ఎదుర్కుంటున్నప్పటికీ ఇది తాత్కాలికంగా చూస్తున్నట్లు తెలిపారు. మార్కెట్‌ తరువాత ర్యాలీలో అన్ని ప్రధాన కంపెనీలు ఉండవని.. ఇందుచేత ఎంపిక చేసిన షేర్లు, నూతన అవకాశాలను చూడమని సూచిస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రధాన పోటీని ఇచ్చే ఇతర పార్టీ లేనందున ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమే మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన సంస్కరణలు కొనసాగుతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 



You may be interested

ఆరురోజుల ర్యాలీకి బ్రేకులు

Tuesday 4th December 2018

లాభాల స్వీకరణకు పూనుకున్న ఇన్వెస్టర్లు ఆర్‌బీఐ విధానం కోసం ఎదురుచూపులు బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లలో లాభాల స్వీకరణతో సూచీల ఆరురోజుల ర్యాలీకి మంగళవారం బ్రేక్‌ పడింది. ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ రేపు(బుధవారం) కీలక వడ్డీరేట్లపై తన విధానాన్ని ప్రకటిస్తున్న తరుణంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ర్యాలీ కొనసాగుతుండంతో నేటి ట్రేడింగ్‌లో కూడా డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనత మార్కెట్‌ సెంటిమెంట్‌

ఈ 8 షేర్లతో మార్కెట్‌ ర్యాలీ

Tuesday 4th December 2018

ముంబై: ప్రధాన సూచీల్లోని ఎంపిక చేసిన ఎనిమిది షేర్ల ఎర్నింగ్స్‌ వృద్ధి మొత్తం ర్యాలీకి దోహదపడనుందని ప్రముఖ బ్రోకరేజ్‌ సీఎల్‌ఎస్‌ఏ విశ్లేషించింది. కేవలం ఈ షేర్లలో వృద్ది ద్వారానే తరువాత ర్యాలీ ఉండనుందని తెలిపింది. వచ్చే ఆర్థిక సంత్సరంలో నిఫ్టీ ఎర్నింగ్స్‌ 25 శాతం వృద్ధి చెందేందుకు అవకాశం ఉందని వివరించిన ఈ బ్రోకింగ్‌ సంస్థ.. గడిచిన ఎనిమిదేళ్ల సగటు 6.5 శాతంగా ఉన్నట్లు తెలిపింది. తమ విశ్లేషణ ప్రకారం

Most from this category