STOCKS

News


రికవరీకి సగటున 66 రోజులు?!

Friday 5th October 2018
Markets_main1538719216.png-20886

ఆగస్టు గరిష్ఠాల నుంచి దేశీయ సూచీలు దాదాపు 11 శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్‌ దాదాపు 4వేల పాయింట్లు క్షీణించింది. అక్టోబర్‌ వచ్చినా కరెక‌్షన్‌ ఆగకపోవడంతో చిన్న ఇన్వెస్టర్ల నుంచి బడా మదుపరుల వరకు ఆందోళనగా ఉన్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే ఏం చేయాలని పెద్ద పెద్ద ఫండ్‌ హౌస్‌లు సైతం తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. అయితే గత చరిత్ర పరిశీలిస్తే ఇలాంటి పతనాలు వచ్చినప్పుడల్లా కొత్త పెట్టుబడులు వచ్చి మార్కెట్లు బౌన్స్‌ బ్యాక్‌ అయినట్లు తెలుస్తుంది. 2003-07 బుల్‌ మార్కెట్‌ను పరిశీలిస్తే కరెక‌్షన్స్‌ పూర్తయ్యాక రికవరీకి సరాసరిన 66 రోజులు పట్టవచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ నివేదిక మందింపు చేసింది. అదేవిధంగా ఈసమయంలో కరెక‌్షన్లలో సూచీల సరాసరి పతనం 14 శాతం వరకు ఉన్నట్లు తెలిపింది. ఈ నాలుగేళ్లలో 2004లో సూచీ 27 శాతం, 2006లో 35 శాతం మేర క్షీణించింది. ఈ రెండు సందర్భాల్లో కరెక‌్షన్‌కు వరుసగా 22, 35 రోజులు పట్టగా రికవరీకి 187, 124 రోజుల సమయం పట్టింది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన పతనంలో సూచీలు దాదాపు 10 శాతం పడిపోయాయి. అనంతరం వీటి రికవరీకి 55 రోజులు పట్టింది. అందువల్ల ఈ దఫా కరెక‌్షన్‌ సైతం త్వరలో ముగింపునకు రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత బుల్‌ మార్కెట్లో తాజా కరెక‌్షన్‌ మూడోది. క్రూడాయిల్‌ ధరల పతనం, రూపాయి క్షీణత, ఎఫ్‌ఐఐల వెనకంజ, యూఎస్‌ ట్రెజరీ బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం.. తాజా పతనానికి కారణాలు. ఈ కరెక‌్షన్స్‌ కామన్‌ అని, దేశీయ సూచీలు దీర్ఘకాలిక రన్‌లో ఉన్నాయని, ఇలాంటి సమయాల్లో నాణ్యమైన స్టాకులను ఎంచుకొని లాంగ్‌టర్మ్‌ వేచిచూడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. 



You may be interested

స్థూల ఆర్థికాంశాలు మారాయ్‌... ఎర్నింగ్స్‌ సమీక్షించాలి..

Friday 5th October 2018

ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు గురువారం రోజు 2 శాతానికిపైగా పతనమయ్యాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసని తెలిపారు. నిఫ్టీ తన 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ 10,777 పాయింట్ల దిగువకు వచ్చేసిందని పేర్కొన్నారు. సగటు కన్నా ఎక్కువ వ్యాల్యూమ్స్‌తో మార్కెట్లు పడిపోయాయని తెలిపారు. ఇది ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు విక్రయాలను తెలియజేస్తోందని, వీళ్లు ఐటీ సర్వీసెస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, పలు ప్రైవేట్‌ బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు సహా

స్థిరంగా పసిడి ధర

Friday 5th October 2018

పసిడి ధర శుక్రవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. అమెరికా పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ రెండేళ్ల గరిష్టానికి చేరుకోవడం, నేడు అమెరికా ఉద్యోగ గణాంకాలు విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల ఎదురుచూపులు ఇందుకు కారణమవుతున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి 0.80 డాలర్ల లాభంతో 1,202.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రానున్న రోజుల్లో ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలతో డాలర్‌ బలపపడంతో

Most from this category