STOCKS

News


పతనం బాటలో ప్రపంచ మార్కెట్లు

Wednesday 2nd January 2019
Markets_main1546426564.png-23373

చైనా ఫ్యాక్టరీ యాక్టివిటీలో మందగమనం
నష్టాల్లో యూఎస్‌ ఫ్యూచర్స్‌
బుధవారం ట్రేడింగ్‌లో అటు ఆసియా, ఇటు యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. చైనా ఫ్యాక్టరీ యాక్టివిటీ మందగించడం, యూరోజోన్‌ పీఎంఐ సూచీ రెండేళ్ల కనిష్ఠానికి చేరడంతో ప్రపంచ ఆర్థిక సంక్షోభంపై మరోమారు భయాలు మొదలయ్యాయి. దీంతో బుధవారం ఎంఎస్‌సీఐ వరల్డ్‌ ఇండెక్స్‌ 0.4 శాతం క్షీణించింది. చైనా మార్కెట్‌ 1.3 శాతం, హ్యాంగ్‌సంగ్‌ 2.77 శాతం, నికాయ్‌ 0.4 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 1.5 శాతం, నిఫ్టీ 1 శాతం మేర క్షీణించాయి. యూరప్‌ మార్కెట్లుఉ 0.5 శాతం నుంచి 2 శాతం వరకు నష్టాల్లో కొనసాగుతున్నాయి. యూఎస్‌ ఫ్యూచర్స్‌ దాదాపు 1 శాతం పైన నష్టాల్లో ఉన్నాయి.

చైనా ఫ్యాక్టరీ అవుట్‌పుట్‌ రెండేళ్ల తర్వాత తొలిసారి కుంచించుకుపోయింది. మరోవైపు యూరప్‌లో కొనుగోలు శక్తికి సూచికైన పీఎంఐ ఇండెక్స్‌ రెండేళ్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో అటు ఆసియా, ఇటు యూరప్‌లో వృద్ధిపై భయాలు మరింత పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనాల వైపు మరలడంతో ఈక్విటీలు నష్టపోయాయి. గత నెల చివరకు ఈసీబీ బాండ్‌ బయ్యింగ్‌ కార్యక్రమం ముగించింది. ఈ ప్రభావం ఇకమీదట కనిపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వృద్ధి పరుగుకు సూచికైన స్టీల్‌ ఫ్యూచర్స్‌ బుధవారం ట్రేడింగ్‌లో 1.5 శాతం క్షీణించాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర ఒక శాతం మేర పతనమైంది. కమోడిటీ ఆధారిత కరెన్సీలైన ఆస్ట్రేలియా డాలర్‌ సహా పలు కరెన్సీలు నేల చూపులు చూశాయి. ఇదే సమయంలో ఇటలీ బ్యాంకులపై భయాలు మరోమారు చెలరేగాయి. ఇటలీ బ్యాంక్‌ సూచీ 2.2 శాతం పడిపోయింది. ఈక్విటీలపై భయాలతో ఇన్వెస్టర్లు బాండ్స్‌వైపు మరలడంతో జర్మనీ, యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ పతనమయ్యాయి. సేఫ్‌బెట్స్‌గా పరిగణించే బంగారం, యెన్‌ ర్యాలీ చేశాయి. ఈ వారం విడుదలయ్యే డేటా ఆధారంగా మార్కెట్ల కదలికలుంటాయని అంచనా.



You may be interested

విదేశీ ఇన్వెస్టర్లలో నమ్మకం సడల్లేదు: విలియం ఓ నీల్‌

Thursday 3rd January 2019

గతేడాది నిరాశ తర్వాత... మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయని, 2019లో మార్కెట్‌ ర్యాలీ చేస్తే అన్ని సూచీలు పాల్గొంటాయని విలియం ఓ నీల్‌ ఇండియా రీసెర్చ్‌ డైరెక్టర్‌ విపిన్‌ ఖరే తెలిపారు. మే నెలలో జరిగే ఎన్నికలు కీలకమైన వ్యవహారమని, ఫలితాలు స్టాక్‌ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపవన్నారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలప్పుడు మార్కెట్లు ఏ విధంగా స్పందించాయో గుర్తు చేశారు. భారత్‌ ఇప్పటికీ అత్యంత వేగంగా వృద్ధి

36 వేల దిగువకు సెన్సెక్స్‌

Wednesday 2nd January 2019

10800దిగువకు నిఫ్టీ సూచీలను దెబ్బతీసిన మెటల్, అటో షేర్ల పతనం అటో, మెటల్‌ రంగ షేర్ల పతనంతో బుధవారం మార్కెట్‌ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్‌ 36వేల మార్కును, నిఫ్టీ 10800 స్థాయిని కోల్పోయింది. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న మన మార్కెట్‌ నేడు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి క్రమంగా నష్టాలను నమోదు చేసింది.డిసెంబర్‌లో వాహన విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగకపోవడం అటో రంగ షేర్లు, చైనా ఉత్పాదక రంగం క్షీణించడంతో

Most from this category