STOCKS

News


మూలాలు బలంగా ఉంటే... కొనుగోళ్లకు అవకాశమిదే...

Thursday 28th February 2019
Markets_main1551293051.png-24364

భారత్‌-పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యం... కశ్మీర్లో ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన వైమానిక చర్యతో కేంద్రంలో బీజేపీ విజయావకాశాలు మెరుగుపడ్డాయని ఎక్కువ మంది అనలిస్టులు భావిస్తున్నారు. దీనివల్ల ప్రస్తుత విధానాలు, సంస్కరణలు కొనసాగుతాయని, ఇది కచ్చితంగా మార్కెట్లకు సానుకూలమని ఎలారా క్యాపిటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ రవి ముత్తు కృష్ణన్‌ పేర్కొన్నారు. ఓ ఆంగ్ల ప్రతికకు ఆయన పలు అంశాలపై ఇంటర్వ్యూ ఇచ్చారు. 

 

మార్కెట్లపై ఉద్రిక్తతల ప్రభావం...?
భౌగోళిక రాజకీయ ప్రతికూల ప్రభావాలు మార్కెట్లపైనా ప్రతిఫలిస్తాయి. అయితే, భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ ద్వారా వైమానిక చర్యను నాన్‌ మిలటరీ చర్యగానే పేర్కొంది. మిలటరీ, పౌరుల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టు ప్రకటించింది. కనుక ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యే అవకాశాలు తక్కువే. కనుక తక్కువ తీవ్రత ఉన్న అంశాల ప్రభావం మార్కెట్లపై ఉండదు. బీజేపీ ప్రభుత్వం ఈ సంక్షోభం నుంచి బలంగా బయటకు వస్తే... తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇదే జరిగితే విధానాలు కొనసాగుతాయి. ఇది కచ్చితంగా మార్కెట్లకు సానుకూలం. 

 

ఇన్వెస్టర్లు అమ్ముకోవాలా లేక పడినప్పుడు కొనాలా?
గత ఎన్నికల సంవత్సరాలను పరిశీలిస్తే... ఎన్నికల ముందు నెలల్లో అస్థిరతలు పెరిగి, ఆ తర్వాత తగ్గినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైమానిక దాడులతో ఆటుపోట్లు మరింత ఎక్కువయ్యాయి. అయితే, భారత మార్కెట్ల మూలాలు బలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం అనుకూలంగా మారడం, బలమైన జీడీపీ వృద్ధితో ఎర్నింగ్స్‌ పుంజుకుంటాయని అంచనా. ఈ నేపథ్యంలో మార్కెట్ల కరెక్షన్లలో నాణ్యమైన స్టాక్స్‌ను కొనుగోలు చేయాలని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నాం. 

 

గతంలో ఈ తరహా అనుభవాల్లో ఏం జరిగింది?
మార్కెట్లపై, ఆర్థిక రంగంపై కార్గిల్‌ యుద్ధం ప్రతికూల ప్రభావం చూపించలేదు. పైగా ఆ సమయంలో మార్కెట్లు 35 శాతం పెరిగాయి. జీడీపీ వృద్ధి 1999-2000లో 6.5 శాతంగా ఉంది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఏ మాత్రం తగ్గలేదు. కనుక యుద్ద ప్రభావం ఆర్థిక రంగంపై ఏమీ చూపలేదు. ఆర్థిక మూలాలు బలంగా ఉన్నప్పుడు ఈ తరహా ఉద్రిక్తతల వల్ల కరెక్షన్లు చోటు చేసుకుంటే వ్యాల్యూ బైయింగ్‌కు మంచి అవకాశంగా పేర్కొంటాం.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 22 పాయింట్లు అప్‌

Thursday 28th February 2019

 ఇండోపాక్‌ ఉద్రిక్తతల నడుమ వరుసగా రెండురోజులపాటు నష్టాల్ని చవిచూసిన భారత్‌ సూచీలు గురువారం  పాజిటివ్‌గా ప్రారభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 22 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.45 గంటలకు 10,832పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,810 పాయింట్ల వద్ద ముగిసింది. గత రాత్రి అమెరికా, యూరప్‌ సూచీలు స్వల్పంగా క్షీణించాయి. తాజాగా

వీపీఎఫ్‌లో చందా పెంచుకునేందుకు సరైన తరుణమేనా?

Thursday 28th February 2019

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) బోర్డు ప్రావిడెంట్‌ ఫండ్‌పై ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.65 శాతానికి పెంచుతూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరానికి ఇది 8.55 శాతం కాగా దానిపై పది బేసిస్‌ పాయింట్లు పెంచింది. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. కీలకమైన సాధారణ ఎన్నికల ముందు ఆర్థిక శాఖ దీనికి ఆమోదం తెలపడం లాంఛనమే. ఈపీఎఫ్‌కు అదనంగా

Most from this category