STOCKS

News


సెబీకి సాంకేతిక సేవలకు 7 సంస్థల షార్ట్‌లిస్ట్‌

Monday 12th November 2018
Markets_main1541999498.png-21883

న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్లను మరింత మెరుగ్గా పర్యవేక్షించేందుకు అవసరమైన సాంకేతిక సేవలు అందించడం కోసం ఏడు ఐటీ సంస్థలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. వీటిలో విప్రో, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, యాక్సెంచర్‌ సొల్యుషన్స్‌, క్యాప్‌జెమిని టెక్నాలజీ సర్వీసెస్ ఇండియా, హ్యులెట్ ‍ప్యాకార్డ్‌, ఈఐటీ సర్వీసెస్‌, తరవు టెక్నాలజీస్ ఉన్నాయి. విశ్లేషణ సామర్ధ్యాలను మెరుగుపర్చడం, ప్రైవేట్ క్లౌడ్‌ డేటా స్టోరేజీని రూపొందించడం, బ్రోకరేజి సంస్థల లావాదేవీలను ఆటోమేటిక్‌గా తనిఖీ చేయగలిగే సామర్ధ్యాన్ని సమకూర్చడం తదితర అంశాలకు సంబంధించి ఈ సంస్థలు టెక్నాలజీపరమైన సేవలు అందించాల్సి ఉంటుంది. తద్వారా నిఘా, విచారణ కార్యకలాపాలను మరింత పటిష్టం చేయొచ్చని సెబీ భావిస్తోంది.



You may be interested

గణాంకాలు, ప్రపంచ పరిణామాలు  కీలకం

Monday 12th November 2018

కంపెనీల క్యూ2 ఫలితాలు దాదాపు ముగింపు దశకు రావడంతో  దేశీ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాల ప్రభావం ఈ వారం స్టాక్‌ మార్కెట్‌పై ఉండనున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, ప్రపంచ మార్కెట్ల గమనం, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు వంటి  ప్రపంచ పరిణామాలు, రాష్ట్రాల ఎన్నికల సంబంధిత వార్తలు, డాలర్‌తో రూపాయి మారకం తదితర అంశాలు  కూడా స్టాక్‌సూచీల గమనాన్ని నిర్దశించనున్నాయి. నేడు రిటైల్‌ గణాంకాలు.. గత  నెల రిటైల్‌

చెక్కుచెదరని పనితీరు!

Monday 12th November 2018

యూటీఐ ఈక్విటీ ఫండ్‌ రిస్క్‌ పెద్దగా భరించలేని వారు, అదే సమయంలో ఈక్విటీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయాలని భావించే వారు యూటీఐ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ఇది మల్టీక్యాప్‌ ఫండ్‌. ఇప్పటి వరకు రాబడుల చరిత్ర మెరుగ్గా ఉంది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో చెప్పుకోతగ్గ స్థాయిలో పనితీరు ఉంది. 2017లో ఏకంగా 30 శాతం మేర ఈ పథకం ఎన్‌ఏవీ పెరిగింది. అయితే, ఈ విభాగం సగటు రాబడుల కంటే

Most from this category