STOCKS

News


విప్రో బైబ్యాక్‌లో పాల్గొంటే పోదూ..!

Sunday 21st April 2019
Markets_main1555868426.png-25252

ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో లాభం మార్చి త్రైమాసికంలో గణనీయంగా పెరిగింది. ఈ సందర్భంగా కంపెనీ రూ.10,500 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. కానీ, ఇవేవీ కంపెనీ షేరు ధరను పరుగెత్తించలేకపోయాయి. 2008-09 తర్వాత ఆదాయం విషయంలో దారుణ పనితీరు చూపించినది 2018-19లోనే కావడం గమనార్హం. ఆదాయం కేవలం 3.8 శాతమే వృద్ధి సాధించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 4.3 శాతంగా ఉంది. గత ఏడు ఆర్థిక సంవత్సరాలుగా కంపెనీ ఆదాయ వృద్ధి కేవలం ఒకే అంకెకు పరిమితమవుతూ వస్తోంది. చివరిగా 2011-12లో రెండంకెల వృద్ధి 13.4 శాతం (5,931 మిలియన్‌ డాలర్లు) నమోదైంది.

 

పోటీ కంపెనీలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఆదాయంలో వృద్ధి వేగంగా ఉంటోంది. 2018 జూన్‌ త్రైమాసికంలో డాలర్‌ మారకం ఆర్డర్ల విషయంలో విప్రోను హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అధిగమించి మూడో స్థానానికి చేరుకోవడం గమనార్హం. ఐదేళ్ల కాంపౌండెడ్‌ వృద్ధి ఆధారంగా చూస్తే... టీసీఎస్‌ ఆదాయం 9.2 శాతం, ఇన్ఫోసిస్‌ 7.4 శాతం చొప్పున డాలర్‌ ఆదాయంలో వృద్ధిని చూపించాయి. విప్రో మాత్రం 4.2 శాతం దగ్గరే ఆగిపోయింది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మార్చి క్వార్టర్‌ ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ ప్రకారం విప్రో భవిష్యత్తు అవకాశాలు అంత ఆశాజనకంగా కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్‌ త్రైమాసికంలో సీక్వెన్షియల్‌గా విప్రో ఆదాయం 1 శాతం వృద్ధి చెందొచ్చని అంచనా. సింగిల్‌ డిజిట్‌ వృద్ధిజోన్‌లో దిగువకు పడిపోయిందంటున్నారు. ఈ ప్రకారం చూస్తే... తాజా బైబ్యాక్‌ ఆఫర్‌లో భాగంగా ఒక్కో షేరు తిరిగి కొనుగోలు ధర రూ.325 అన్నది ఈ రంగంలోనే వేరే కంపెనీలకు మారిపోవాలన్న ఇన్వెస్టర్లకు లాభదాయకమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌ గురువారం క్లోజింగ్‌ ధర రూ.284.80తో పోలిస్తే బైబ్యాక్‌ ధర 14 శాతం అధికం కావడం గమనార్హంYou may be interested

ఐపీవోకు రెండు కంపెనీలు

Sunday 21st April 2019

నియోజెన్‌ కెమికల్స్‌ రూ.132 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఈ వారంలోనే ఐపీవోకు రానుంది. బుధవారం ఇది ప్రారంభమవుతుంది. తాజా ఇష్యూ పరిమాణం రూ.70 కోట్లు. ప్రమోటర్లు హరిదాస్‌ తకర్షి కనాని, బీనా హరిదాస్‌ కనాని 29 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ధరల శ్రేణి రూ.212-215.    నియోజెన్‌ కంపెనీ ఆర్గానిక్‌ కెమికల్‌ కాంపౌండ్స్‌, బ్రోమిన్‌ కాంపౌండ్స్‌, ఇతర ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ అయిన క్లోరిన్‌, ఫ్లోరిన్‌, ఐయోడిన్‌ తదితర రసాయనాలను ఫార్మాస్యూటికల్స్‌, ఆగ్రోకెమికల్‌,

జెట్‌ ఉద్యోగులకు స్పైస్‌జెట్‌ ఆసరా

Saturday 20th April 2019

500మంది రిక్రూట్‌మెంట్‌ వంద మంది పైలట్లతో సహా 500మంది జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులకు తమ కంపెనీలో ఉద్యోగాలు కల్పించినట్లు స్పైస్‌జెట్‌ ప్రకటించింది. అవసరాన్ని బట్టి మరింత మందిని తీసుకుంటామని భరోసా ఇచ్చింది. త్వరలో మరిన్ని రూట్లలో మరిన్ని విమానాలు నడిపేందుకు రెడీ అవుతున్నందున వీలయినంతమందిని తీసుకుంటామని తెలిపింది. జెట్‌ మూసివేతతో ఏర్పడ్డ కొరతను పూడ్చేందుకు స్పైస్‌జెట్‌ ఇప్పటికే 27 విమానాలను కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో రిక్రూట్‌మెంట్‌లో భాగంగా జెట్‌ఎయిర్‌వేస్‌ ఉద్యోగులకు

Most from this category