STOCKS

News


రూపీ రికవరీ: నష్టాల్లో ఐటీ షేర్లు

Wednesday 10th October 2018
Markets_main1539160179.png-21017

ముంబై:- కనిష్టస్థాయిల నుంచి రూపాయి రీకవరీ కారణంగా బుధవారం ఐటీ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతంగా నష్టపోయింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో 74.39 వద్ద జీవితకాల కనిష్టాన్ని నమోదు చేసింది. పతనమవుతున్న  రూపాయిని ఆదుకునేందుకు, ఆర్థిక వ్యవస్థలో లిక్విటిడిని పెంచేందుకు ప్రభుత్వం ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా రూ.12వేల కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. పలితంగా నేటి ట్రేడింగ్‌ డాలర్‌ మారకంలో రూపాయి విలువ 74.13 స్థాయి వరకు బలపడింది. రూపాయి రీకవరీతో డాలర్ల రూపంలో ఆదాయాన్ని ఆర్జించే ఐటీ షేర్ల పతనం ప్రారంభమైంది. మధ్యాహ్నం గం:1:30ని.లకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1.75శాతం నష్టంతో 15,129.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీలోని మొత్తం 10షేర్లకు గానూ 5షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, మరో 5షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇదే సమయానికి నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-5 లూజర్లలో ఏకంగా 4 షేర్లు చోటు దక్కించుకోవడం గమనార్హం. ఈ సూచీలో ఇన్ఫోసిస్‌ అత్యధికంగా 3శాతం నష్టపోయింది. హెచ్‌సీఎల్‌, విప్రో, టీసీఎస్‌ 2శాతం క్షీణించగా, మైండ్‌ ట్రీ షేరు 1శాతం వరకు పతనమైంది. మరోవైపు టాటాఎలాక్సీ్‌, ఎన్‌ఐఐటీటెక్‌ 4శాతం లాభపడ్డాయి. వాటితో పాటు ఓఎఫ్‌ఎస్‌ఎస్‌, టెక్‌మహీంద్రా, ఇన్ఫీభీమ్‌ షేర్లు 1శాతం లాభడపడ్డాయి.
-    టీసీఎస్‌ కంపెనీ రేపు(అక్టోబర్‌ 11న), ఇన్ఫోసిస్‌ వచ్చే మంగళవారం(అక్టోబర్‌ 16న) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం త్రైమాసిక ఫలితాలను విడుదల చేయన్నాయి.



You may be interested

బంధన్‌ బ్యాంక్‌ లాభం 47 శాతం జంప్‌

Wednesday 10th October 2018

ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (జూలై-సెప్టెంబర్‌, క్యూ2) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే బ్యాంక్‌ నికర లాభం 47.4 శాతం వృద్ధితో రూ.488 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ.331 కోట్లుగా నమోదయ్యింది. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 55.6 శాతం వృద్ధితో రూ.1,078 కోట్లకు ఎగసింది. స్థూల ఎన్‌పీఏలు

క్యాడ్‌తోనే ఆందోళన..

Wednesday 10th October 2018

అధిక క్రూడ్‌ ధరలు ఆర్థిక వ్యవస్థకు చేటని మనులైఫ్‌ ఏఎం ఎండీ రాణా బి గుప్తా తెలిపారు. ఒక వేళ వాణిజ్య లోటు 18-19 బిలియన్‌ డాలర్లమేర నమోదైతే.. అప్పుడు కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) దాదాపు 3 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. ఇది ఆందోళన చెందాల్సిన అంశమని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఫెడ్‌ పాలసీ నిర్ణయాలను రాజకీయాలు

Most from this category