STOCKS

News


19ఏళ్ల గరిష్ఠానికి విప్రో షేరు

Wednesday 23rd January 2019
Markets_main1548226777.png-23753

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం విప్రో షేరు బుధవారం ట్రేడింగ్‌లో 19 సంవత్సరాల గరిష్ఠస్థాయి(రూ.354.60- మధ్యాహ్నం 12.25కు) వద్ద ట్రేడవుతోంది. గతేడాది జరిపిన అప్‌మూవ్‌ అనంతరం షేరు వెనుకంజ వేసింది. తిరిగి పుంజుకొని గత ర్యాలీకి 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి వరకు పెరిగింది. ఈ క్రమంలో రూ. 348.22 వద్ద పైస్థాయి నిరోధాన్ని అధిగమించింది. దీంతో విప్రో మరికొన్ని సెషన్లలో తదుపరి నిరోధం 360.56 రూపాయల వరకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయి వద్ద 76.4 శాతం రిట్రేస్‌మెంట్‌ నిరోధం ఎదురవుతుంది. స్టాకు గత ఐదురోజుల సరాసరి వాల్యూంలు గత నెల రోజుల సరాసరి వాల్యూంల కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ధర మరింత పెరగవచ్చని అంచనా. ఎంఏసీడీ ప్రస్తుతం పాజిటివ్‌ క్రాసోవర్‌లో ఉంది. గత నెల రోజుల్లో షేరు దాదాపు 8 శాతం లాభపడింది. గత వారం కంపెనీ క్యు3 ఫలితాలు ప్రకటించింది. ఇందులో అనూహ్య పాజిటివ్‌ మార్జిన్లు చూపింది. 



You may be interested

90 షేర్లు... 52వారాల కనిష్టానికి..!

Wednesday 23rd January 2019

మార్కెట్‌ ఫ్లాట్‌ ట్రేడింగ్‌ భాగంగా బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో 90 షేర్లు 52వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిలో భాగంగా ఆదిత్య బిర్లా క్యాపిటల్‌, భారత్‌ వైర్స్‌ రోప్స్‌, ది బైకే హాస్పిటాలిటీ, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, దీపక్‌ ఫర్టిలేజర్స్‌, దేనా బ్యాంక్‌, ఫినోలాక్స్‌ కేబుల్స్‌, జిందాల్‌ స్టీల్‌లెస్‌, కిర్లోస్కర్‌ ఆయిల్‌ ఇంజన్స్‌, ఎల్‌ఈఈఎల్‌ ఎలక్ట్రానిక్స్‌, మార్టిన్‌ అల్లాయస్‌, మెక్‌లాయిడ్‌ రస్సెల్‌, నీల్‌కమల్‌, ప్రభాత్‌ డైరీ, పుంజ్‌లాయిడ్‌, మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌,

ఐటీసీ ఫలితాలు.. ఏం చూడాలి?

Wednesday 23rd January 2019

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం మూడో త్రైమాసిక ఫలితాలు బుధవారం విడుదల చేయనుంది. ఈ దఫా కంపెనీ బలమైన ఫలితాలు ప్రకటించవచ్చని అంచనాలున్నాయి. సిగిరెట్‌ వ్యాపారం మరింత పుంజుకుంటుందని, ఎఫ్‌ఎంసీజీ, హోటల్‌ వ్యాపారం జోరు కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ త్రైమాసికంలో కంపెనీ షేరు దాదాపు 5 శాతం పతనమైంది. కంపెనీ నికరలాభం సరాసరిన 12 శాతం ఉండొచ్చని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. అంచనాలు: - ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌: లాభంలో 13.8 శాతం వృద్ది. సిగరెట్‌

Most from this category