STOCKS

News


విప్రోకు డౌన్‌గ్రేడ్‌ షాక్‌

Wednesday 27th February 2019
Markets_main1551259857.png-24360

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ విప్రో షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 3.50 శాతం నష్టపోయాయి. ఈ కంపెనీ షేరును గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం క్రెడిట్‌ సూసీ డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో విప్రో షేర్లు రూ.380.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రానున్న రోజుల్లో కంపెనీ మార్జిన్లతో పాటు ఆదాయాలు సైతం ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ విశ్లేషకులు అంచనావేశారు. దీంతో బ్రోకరేజ్‌ సంస్థ షేరు రేటింగ్‌ను ‘‘అవుట్‌ ఫెర్మామింగ్‌ నుంచి ‘‘న్యూట్రల్‌’’ స్థాయికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. అలాగే షేరుకు గతంలో కేటాయించిన రూ.370ల టార్గెట్‌ ధరను రూ.320లకు సవరిస్తున్నట్లు క్రిడెట్‌ సూసీ ప్రకటించింది. బ్రోకరేజ్‌ సంస్థ షేరు టార్గెట్‌ ధరను సవరించడంతో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గచూపారు. దీంతో ఇంట్రాడేలో షేరు 3.50శాతం నష్టపోయి రూ.373.80ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి తాకింది. మధ్యాహ్నం గం.2:00లకు షేరు గతముగింపు(రూ.387.2)తో పోలిస్తే 3శాతం నష్టంతో రూ.375.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ.253.50  రూ.396.00లుగా నమోదయ్యాయి. 



You may be interested

636 పాయింట్ల శ్రేణిలో సెన్సెక్స్‌ హెచ్చుతగ్గులు

Wednesday 27th February 2019

రెండో రోజూ నష్టాలే..! భారత్‌ - పాకిస్థాన్‌ల సరిహద్దు యుద్ధభయాలతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ గరిష్టస్థాయి 36,371 నుంచి 636 పాయింట్ల శ్రేణిలో కదలాడగా, నిఫ్టీ 10,940 స్థాయి నుంచి 189 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం పాటు బలహీన అంతర్జాతీయ సంకేతాలు, ముడిచమురు ధరలు పెరగడటం తదితర ప్రతికూలాంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, మెటల్‌ షేర్లలో

పాక్‌ మార్కెట్‌ 1500 పాయింట్లు క్రాష్‌

Wednesday 27th February 2019

భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్ పాకిస్థాన్‌ స్టాక్‌ మార్కెట్‌ను భారీగా అతలాకుతలం చేశాయి. ఈ దేశ స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌ ప్రధాన సూచీ కరాచీ 100 నేటి ట్రేడింగ్‌లో ఏకంగా 1500 పాయింట్లను నష్టపోయింది. పుల్వామా ఉగ్రదాడి ప్రతీకారంలో భాగంగా బుధవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని బాలాకోట్, ముజఫరాబాద్, చకోటీ ప్రాంతాల్లో భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈ ఘటనలో సుమారు 350 మంది టెర్రరిస్టులు చనిపోయినట్టు అంచనా.

Most from this category