STOCKS

News


విప్రో ఏడీఆర్‌ 3.50శాతం అప్‌

Friday 19th April 2019
Markets_main1555660554.png-25228

అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే మన దేశపు అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌) గురువారం రాత్రి మిశ్రమంగా ముగిశాయి. అత్యధికంగా విప్రో అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌) 3.50శాతం లాభపడింది. టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 2.50శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 1.50శాతం, హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ అరశాతం చొప్పున పెరిగాయి. మరోవైపు ఐసీఐసీఐ ఏడీఆర్‌ 1శాతం నష్టపోగా, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ అరశాతం క్షీణించింది.

డోజోన్స్‌ జూమ్‌...

మెరుగైన ఆర్థిక గణాంకాల ప్రకటనతో పాటు కంపెనీల మొదటి త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడంతో గురువారం రాత్రి అమెరికా ప్రధాన సూచీలు లాభాలతో ముగిశాయి. అమెరికా బెంచ్‌మార్క్‌ సూచీలైన డో జోన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఏవరేజ్‌ సూచీ 110 పాయింట్లు(0.42శాతం) పెరిగి 26,559.54 వద్ద, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 4.58 పాయింట్లు(0.16శాతం) లాభంతో 2,905.03 వద్ద, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 2పాయింట్ల లాభంతో 7,998 వద్ద స్థిరపడ్డాయి. ఎస్‌ అండ్‌ పీ500 ఇండెక్స్‌ వరుసగా మూడోవారం లాభంతో ముగియగా, డౌ జోన్స్‌, నాస్‌డాక్‌ సూచీలు ఈ వారం మొత్తం లాభాలతో ముగిశాయి. అమెరికా - చైనాల వాణిజ్య చర్చలపై అమెరికా అధికార ప్రతినిధి ఒకరు సానుకూల వాఖ్యలు చేయడంతో పాటు, పలు దిగ్గజ కంపెనీల మొదటి త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడంతో పారిశ్రామిక రంగ షేర్లు భారీ ర్యాలీ చేశాయి. అమెరికా రిటైల్‌ అమ్మకాల గణాంకాలు మార్చిలో ఏడాదిన్నర గరిష్టాన్ని తాకండతో పాటు గతవారం అమెరికా నిరుద్యోగ గణాంకాలు సైతం మార్కెట్‌ వర్గాలను మెప్పించడం సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఆర్థిక మందగమన ఆందోళన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసిక ఫలితాలు అంతంత మాత్రమే నమోదు కావచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేసాయి. అయితే విశ్లేషకుల అంచనాల భిన్నంగా కంపెనీలు అ‍త్యుత్తమైన ఫలితాలను నమోదు చేస్తుడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. నేడు గుడ్‌ ఫ్రైడ్‌, రేపు ఎల్లుండి(శుక్ర, శని) సాదారణ సెలవులు కావున అమెరికా మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు పనిచేయదు. 



You may be interested

టాటా మోటర్స్‌ షేరులో ఎందుకింత ర్యాలీ?

Friday 19th April 2019

గత కొద్ది కాలంగా టాటామోటర్స్‌ షేరు దూసుకుపోతోంది. ఈ ఒక్క నెల్లోనే షేరు దాదాపు 25 శాతం మేర లాభపడింది. ఈ నేపథ్యంలో షేరును కేవలం రెండు శక్తులే కొనుగోలు చేస్తున్నాయని, అందుకే ఇంతలా ర్యాలీ జరుపుతోందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. టాటామోటర్స్‌ కంపెనీ మౌలికంగా బలమైనదే, పాసింజర్‌ వాహనాల పోర్టుఫోలియో స్థిర ప్రదర్శన చూపుతోంది. కమర్షియల్‌ వాహనాలు సైతం బాగానే విక్రయిస్తోంది. అయితే ఒక్కమారుగా షేరు ధరలో ఇంత ర్యాలీ

11600- 12000పాయింట్ల రేంజ్‌లో నిఫ్టీ!

Friday 19th April 2019

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అంచనా వచ్చే మూడు నాలుగు వారాల పాటు నిఫ్టీ 11600- 12000 పాయింట్ల రేంజ్‌లో కదలాడవచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ రాజేష్‌ పాల్వియా అంచనా వేస్తున్నారు. గత రెండు వారాల శ్రేణిని ఈ వారం నిఫ్టీ దాటి మరో ఆల్‌టైమ్‌హైని చూసింది. దీంతో మిడ్‌టర్మ్‌కు బుల్లిష్‌ సెంటిమెంట్‌ పుంజుకుందని తెలిపారు. చార్టుల్లో హయ్యర్‌టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తోందన్నారు. నిఫ్టీ 11760 పాయింట్లకు పైన ఉన్నంత వరకు బుల్లిష్‌గానే ఉంటుందని,

Most from this category