STOCKS

News


ఇన్ఫోసిస్‌, విప్రో ఏడీఆర్‌లు 2% జంప్‌

Saturday 1st December 2018
Markets_main1543645708.png-22562

  • వేదాంత, టాటా మోటార్స్‌ ఏడీఆర్‌లు 2 శాతం డౌన్‌

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు తగ్గాయి. విప్రో ఏడీఆర్‌ గరిష్టంగా 2 శాతానికి పైగా పెరిగితే.. టాటా మోటార్స్‌, వేదాంత ఏడీఆర్‌లు 2 శాతానికి పైగా క్షీణించాయి. 
టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 2.17 శాతం తగ్గుదలతో 12.20 డాలర్లకు క్షీణించింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ అధిక వ్యాల్యూమ్స్‌తో 1.86 శాతం పెరుగుదలతో 9.86 డాలర్లకు చేరింది. విప్రో ఏడీఆర్‌ 2.55 శాతం పెరుగుదలతో 5.22 డాలర్లకు ఎగసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.32 శాతం క్షీణతతో 101.42 డాలర్లకి తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.64 శాతం తగ్గుదలతో 10.17 డాలర్లకి క్షీణించింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 0.39 శాతం వృద్ధితో 38.44 డాలర్లకి పెరిగింది. ఇక వేదాంత ఏడీఆర్‌ 2.02 శాతం క్షీణతతో 11.15 డాలర్లకు తగ్గింది. 



You may be interested

దీర్ఘకాల పెట్టుబడికి 3 సిఫార్సులు..!

Saturday 1st December 2018

ముంబై: నిఫ్టీ ఏడాది ఫార్వార్డ్‌ బేస్‌ టార్గెట్‌ ప్రస్తుతానికి 10,250 పాయింట్లుగా నిర్ణయించినట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ వెల్లడించారు. ఇంతకుముందు ఉన్నటువంటి 10,400 పాయింట్ల టార్గెట్‌ను ఈమేరకు కుందించినట్లు ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2019 ఆర్థిక సంవత్సర ఎర్నింగ్స్‌ వృద్ధిరేటు 12.5 శాతం, 2020 వృద్ధిరేటు 15 శాతం ఆధారంగా ఈ అంచనాను వెల్లడించారు. ఇంతకుముందు వరుసగా 15, 20

కొస్పి డౌన్‌.. మిగతావి అప్‌..

Saturday 1st December 2018

దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి మినహా మిగతా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లోనే ముగిశాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 8 పాయింట్ల లాభంతో 3,117 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 3 పాయింట్ల లాభంతో 9,888 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 21 పాయింట్ల లాభంతో 2,588 పాయింట్ల వద్ద ఉంది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి

Most from this category