STOCKS

News


ఇండియన్‌ ఏడీఆర్‌లు క్రాష్‌

Saturday 22nd December 2018
Markets_main1545461135.png-23168

  • విప్రో ఏడీఆర్‌ 4 శాతానికి పైగా పతనం

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం భారీగా పతనమయ్యాయి. అన్ని స్టాక్స్‌ నష్టాల్లోనే ముగిశాయి. అధిక వ్యాల్యూమ్స్‌తో ఇన్ఫోసిస్‌ దాదాపు 2 శాతం మేర పడిపోయింది. విప్రో షేరు గరిష్టంగా 4 శాతానికి పైగా పతనమైంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ 3 శాతం మేర, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2 శాతానికి పైగా క్షీణించాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, వేదాంత 1 శాతానికి పైగా పడ్డాయి. టాటా మోటార్స్‌ కనిష్టంగా 0.48 శాతం క్షీణించింది.  
టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.48 శాతం తగ్గుదలతో 12.37 డాలర్లకు క్షీణించింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 1.94 శాతం క్షీణతతో 9.10 డాలర్లకు తగ్గింది. విప్రో ఏడీఆర్‌ 4.09 శాతం తగ్గుదలతో 4.93 డాలర్లకు క్షీణించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 2.33 శాతం క్షీణతతో 100.40 డాలర్లకి తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 2.74 శాతం తగ్గుదలతో 9.93 డాలర్లకి క్షీణించింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 1.21 శాతం క్షీణతతో 36.84 డాలర్లకి తగ్గింది. ఇక వేదాంత ఏడీఆర్‌ 1.14 శాతం తగ్గుదలతో 11.26 డాలర్లకు పతనమైంది. 



You may be interested

ఆఫ్‌షోర్‌లో రూపీ మరింత డౌన్‌

Saturday 22nd December 2018

ఇండియన్‌ రూపాయి ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో మరింత పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే శుక్రవారం రాత్రి 70.34 వద్ద ముగిసింది. రూపాయి రోజంతా 69.76- 70.35 శ్రేణిలో కదలాడింది. కాగా రూపాయి ఇండియన్‌ మార్కెట్‌లో శుక్రవారం 48 పైసలు క్షీణించి 70.18 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది. వారంగా చూస్తే అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 2.4 శాతం లేదా 172 పైసలు

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు ..

Saturday 22nd December 2018

జపాన్‌ మార్కెట్‌ 220 పాయింట్లు డౌన్‌ హాంగ్‌ సెంగ్‌ 130 పాయింట్లు అప్‌ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ప్రారంభంలో సూచీలన్నీ నష్టాల్లో ట్రేడయ్యాయి. అయితే చివరకు వచ్చేసరికి హాంగ్‌ సెంగ్‌, కొస్పి ఇండెక్స్‌లు లాభాల్లోకి వచ్చేశాయి. ఇక మిగతావన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 5 పాయింట్ల నష్టంతో 3,046 పాయింట్ల వద్ద ముగిసింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 28 పాయింట్ల నష్టంతో

Most from this category