STOCKS

News


విప్రో ఏడీఆర్‌ డౌన్‌..

Saturday 15th December 2018
Markets_main1544857054.png-22962

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. ఇకపోతే టాటా మోటార్స్‌, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో ఏడీఆర్‌లన్నీ తగ్గాయి. విప్రో ఏడీఆర్‌ గరిష్టంగా 2 శాతానికి పైగా పడిపోయింది.  
టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.43 శాతం తగ్గుదలతో 11.53 డాలర్లకు క్షీణించింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ అధిక వ్యాల్యూమ్స్‌తో 0.20 శాతం పెరుగుదలతో 9.89 డాలర్లకు చేరింది. విప్రో ఏడీఆర్‌ 2.44 శాతం తగ్గుదలతో 5.19 డాలర్లకు క్షీణించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.32 శాతం క్షీణతతో 100.44 డాలర్లకి తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.31 శాతం పెరుగుదలతో 9.81 డాలర్లకి ఎగసింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 0.03 శాతం లాభంతో 36.61 డాలర్లకి పెరిగింది. ఇక వేదాంత ఏడీఆర్‌ 0.54 శాతం తగ్గుదలతో 11.13 డాలర్లకు పతనమైంది. 



You may be interested

చైనా ఎఫెక్ట్: ఆసియా డల్‌..

Saturday 15th December 2018

చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ విక్రయాల గణాంకాలు నిరుత్సాహానికి గురిచేయడంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాలతోనే ముగిశాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 34 పాయింట్ల నష్టంతో 3,077 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 85 పాయింట్ల నష్టంతో 9,774 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 40 పాయింట్ల నష్టంతో 2,593 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. దక్షిణ కొరియా ఇండెక్స్‌

నిధుల వేటలో మైక్రోఫైనాన్స్‌ సంస్థలు

Saturday 15th December 2018

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణ సంక్షోభ నేపథ్యంలో ద్రవ్య లభ్యత కొరతతో కొట్టుమిట్టాడిన మైక్రోఫైనాన్స్‌ సంస్థలు ఇప్పుడు ప్రత్యమ్నాయ మార్గాలపై దృష్టిని సారించాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో ఆగస్ట్‌27న రూ.9వేల భారీ కుంభకోణం వెలుగు చూడటంతో గత 2-3 నెలలుగా మైక్రోఫైనాన్స్‌ తీవ్ర ద్రవ్య లభ్యత కొరతను ఎదుర్కోన్నాయి. ద్రవ్యలభ్యత కొరత సంక్షోభ సుడిగుండం నుంచి గట్టేందుకు మైక్రోఫైనాన్స్‌ సంస్థలు ప్రత్యమ్నాయ మార్గమైన నిధుల సమీకరణకు మార్కెట్‌ బాట పట్టాయి. ఇప్పటికే ఢిల్లీకి చెందిన  మైక్రోఫైనాన్స్‌

Most from this category