STOCKS

News


గత బుల్‌ ర్యాలీల్లో సత్తా చూపినవి... ఇప్పుడు?

Saturday 30th March 2019
Markets_main1553885857.png-24867

గత ఐదు బుల్‌ మార్కెట్లలో బ్యాంకింగ్‌, ఇండస్ట్రియల్స్‌, మెటల్స్‌ సత్తా చూపించాయి. మరి ఈ విడత అదే రిపీట్‌ అవుతుందా లేక భిన్నంగా ఉంటుందా...? 

 

గడచిన 20 ఏళ్లలో సగటున ఓ బుల్‌ ర్యాలీ 32 నెలల పాటు కొనసాగింది. బేర్‌ మార్కెట్‌ సగటున 15 నెలలు నడిచింది. చివరి బుల్‌ రన్‌ కూడా 2016 ఫిబ్రవరి నుంచి 2018 ఆగస్ట్‌ వరకు కొనసాగింది. భారత్‌లో తదుపరి బుల్‌ రన్‌కు అంతా సిద్ధమైనట్టు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ తన రీసెర్చ్‌ నోట్‌లో పేర్కొంది. బ్యాంకింగ్‌, ఇండస్ట్రియల్‌ రంగాల పట్ల చాలా మంది అనలిస్టులు సానుకూలత వ్యక్తపరుస్తున్నారు. హెల్త్‌కేర్‌ రంగం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌లోనూ ఎంపిక చేసిన స్టాక్స్‌ను సూచిస్తున్నారు. చివరి బుల్‌ రన్‌లో నిఫ్టీ బ్యాంక్‌ 101 శాతం పెరగ్గా, రియల్టీ 111 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 69 శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీ ఫార్మా 7 శాతం పడిపోయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

 

బ్యాంకులు పక్కా
వర్ధమాన దేశాల్లో రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకున్న దేశం భారత్‌ ఒక్కటే. మరో పావు శాతం వరకూ ఏప్రిల్‌ 2-4 నాటి సమీక్షలో ఉంటుందని అంచనా. ప్రతీ బుల్‌ రన్‌లోనూ బ్యాంకులు తప్పకుండా ర్యాలీ చేస్తున్నాయి. ఇప్పటికే నిఫ్టీ బ్యాంకింగ్‌ రంగ సూచీ నూతన గరిష్ట స్థాయిలను చేరింది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్స్‌ ప్రతీ బుల్‌ ర్యాలీలోనూ ప్రధానంగా ఉంటాయని ట్రేడ్‌బుల్స్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ ఆసిఫ్‌ హిరానీ పేర్కొన్నారు. ‘‘తాజా పెట్టుబడుల్లో ఎక్కువ భాగం ప్రైవేటు బ్యాంకింగ్‌ స్టాక్స్‌వైపే వెళుతున్నాయి. బ్యాంకింగ్‌ ఇండెక్స్‌ మెరుగైన పనితీరు కొనసాగిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న బుల్‌ మార్కెట్‌లో ఎంతో సత్తా ఉంది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్స్‌, ఇన్‌ఫ్రా మంచి పనితీరు చూపిస్తాయి’’ అని హిరాని తెలిపారు. 

 

అన్ని ప్రధాన స్థూల ఆర్థిక సంకేతాలు, (ద్రవ్యోల్బణం భవిష్యత్తు అంచనాలు, జీడీపీ వృద్ధి రేటు, బాండ్‌ ఈల్డ్స్‌, చమురు ధరలు, ఎర్నింగ్స్‌) సానుకూల దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఎన్నికల చుట్టూ అనిశ్చితి ఒక్కటే ఉంది. తదుపరి బుల్‌ మార్కెట్‌ ఇప్పటికే ఆరంభమైంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు నిఫ్టీలో ఇతర కంపెనీలతో పోలిస్తే ఎక్కువ లాభాలను నమోదు చేశాయని, ఇవి మంచి పనితీరు చూపిస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పీసీజీ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ స్ట్రాటజీ హెడ్‌ వీకే శర్మ పేర్కొన్నారు. ఇన్‌ఫ్రా రంగంలో ఎల్‌అండ్‌టీ, సద్బావ్‌ ఇంజనీరింగ్‌, ఎన్‌సీసీ, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, జేకుమార్‌ ఇన్‌ఫ్రా స్టాక్స్‌ను సీఎల్‌ఎస్‌ఏ సూచించింది. హెచ్‌ఎస్‌బీసీ మాత్రం ప్రైవేటు బ్యాంకులు యాక్సిస్‌ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతోపాటు, ఏషియన్‌ పెయింట్స్‌, కజారియా సిరామిక్స్‌, జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ను సూచించింది. రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచి గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ను పేర్కొంది. నియంత్రణ పరమైన సమస్యలు, ఉత్పత్తుల విడుదలలో ఆలస్యం, జనరిక్‌ డ్రగ్స్‌ ధరల ఒత్తిళ్ల కారణంగా హెల్త్‌కేర్‌ రంగం పట్ల ప్రతికూలంగా ఉంది. You may be interested

రైల్‌వికాస్‌ నిగమ్‌ ఐపీవో.. బ్రోకరేజీల విశ్లేషణలు

Saturday 30th March 2019

కేంద్ర రైల్వే శాఖకు చెందిన రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ఈ నెల 29న ప్రారంభమైంది. వచ్చే నెల 3న ముగుస్తుంది. ఒక్కో షేరు ఇష్యూ ధరల శ్రేణి రూ.17-19. రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరపై అర్ధరూపాయి తగ్గింపు లభిస్తుంది. మొత్తం 25,34,57,280 షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది. తద్వారా రూ.481 కోట్లు సమీకరించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వరంగ

పల్లాడియంలో రికవరీ

Friday 29th March 2019

మూడు సెషన్లుగా భారీగా పతనమైన పల్లాడియం ధర శుక్రవారం కాస్త రికవరీ అయింది. శుక్రవారం ట్రేడింగ్‌లో రెండునెలల కనిష్ఠాల నుంచి కోలుకొని 1.1 శాతం లాభంతో 1363 డాలర్ల స్థాయికి చేరింది. వాహనాల్లో ఉత్ర్పేరక సహాయకారిగా దీన్ని ఉపయోగిస్తారు. గురువారం ట్రేడింగ్‌లో ఒక్కమారుగా పల్లాడియం ధర 7 శాతం వరకు పతనమైంది. రెండేళ్లలో ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ వృద్ది మందగమనంపై భయాలు కమోడిటీల

Most from this category